Reading Time: < 1 minute

షాది ముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు బిగ్ షాక్.. పథకాల అమలుపై హైకోర్టు స్టే

Caption of Image.

హైదరాబాద్:  తెలంగాణలో షాదీ ముబారక్,కల్యాణ లక్ష్మీ పథకాలపై  హైకోర్టు స్టే విధించింది. ఉచిత పథకాల అమలుపై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు..తదుపరి విచారణ వరకు ఈ పథకాల కింద ఎలాంటి  చెల్లింపులు చేయొద్దని  ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. 

ఉచిత పథకాల అమలుపై లాయర్ విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం (ఆగస్టు12) విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్ కుమార్.. షాదిముబారక్, కల్యాణలక్ష్మీ పథకాలను తాత్కాలికంగా నలిపివేయాలని, ఈ పథకాలకింద ఎలాంటి చెల్లింపులు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

చట్టసభల్లో తీర్మానం లేకుండా  అమలు చేస్తున్న  పథకాలు చెల్లవని విజయ్ గోపాల్ తన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు. గతంలో ఇదే కేసు విచారణలో కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారి చేసినప్పటికీ నాలుగు వారాలైన ప్రభుత్వం స్పందించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో స్టే విధించిన హైకోర్టు..తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

©️ VIL Media Pvt Ltd.