Reading Time: < 1 minute

 తల్లి చనిపోయిందని.. దత్తత పేరుతో  కవలల్ని అమ్మకానికి  పెట్టిన తండ్రి.!

Caption of Image.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో కలకలం సృష్టించిన కవల శిశువుల దత్తత, విక్రయ వ్యవహారం ఇప్పడు తీవ్ర చర్చనీయాంశమైంది. బిడ్డను కనాలన్న ఆశ తీరకముందే… ప్రసవ సమూయంలో దురదృష్టవశాత్తు గంగజల అనే వివాహిత లోకం విడిచివెళ్లింది. గంగజల మరణంతో ఆ శిశువుల తండ్రి సాయిలుకు ఆ ఇద్దరు కవల పిల్లల అలనాపాలన భారంగా మారింది.

ఈ నిస్సహాయతను ఆసరాగా చేసుకున్న ఓ మహిళ… పిల్లలను దత్తత ఇవ్వాలని సాయిలును కోరింది. ఆ తర్వాత ఓ న్యాయవాది ద్వారా నోటరీ చేయించి, ఇద్దరు పిల్లలను వేర్వేరు కుటుంబాలకు దత్తత పేరుతో అప్పగించారు. అయితే ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

►ALSO READ | జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో… డ్రైవర్ నిర్లక్ష్యం… బ్రేక్ సెట్టింగ్ చేస్తున్న మెకానిక్ మృతి…!

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారుల జోక్యంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన శిశు సంక్షేమ శాఖ అధికారులు… తండ్రి సాయిలుతో పాటు పిల్లలను దత్తత తీసుకున్న రెండు కుటుంబాలను విచారణ నిమిత్తం పిలిపించారు. ఆపై ఆ ఇద్దరు శిశువులను భద్రత దృష్ట్యా సిద్ధిపేట శిశు గృహానికి తరలించారు.

చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా, ఇష్టానుసారంగా వ్యవహరించిన తండ్రి సాయిలు, పిల్లలను దత్తత తీసుకున్న రెండు కుటుంబాలు..దత్తత పత్రాలు నోటరీ చేసిన న్యాయవాదిపై రాయికల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.