
తెలుగు తెరపై మహిళా ప్రధాన కథల హవా నడుస్తోంది. ఒకప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన కథానాయికలు, ఇప్పుడు తమ అభినయంతో కథను భుజాలపై మోస్తున్నారు. అనుష్క, సమంత, రష్మిక వంటి స్టార్ నటీమణుల బాటలోనే తాజాగా యువ నటి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) కూడా ఈ ప్రయాణంలో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఆమె, ఇప్పుడు ‘అగధ’ చిత్రంతో పూర్తిగా కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
‘పొలిమేర 1&2’ చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి, ఈ చిత్రంలో ‘మహాదేవి’ అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, కేవలం భావోద్వేగాలకే కాకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా ప్రాధాన్యమున్న పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇది ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
అగధ ఎవరినీ వదలదు.. అందరినీ థియేటర్‌కి తీసుకొచ్చేస్తుంది! 🔥
BOOKINGS OPEN NOW for #Agadha 👿Book your favourite seats at your nearest theatre for a spine-chilling experience packed with scares & sound 🔊💥
In Cinemas on August 14th 👿
Written &… pic.twitter.com/ofrKhpNdY9
— MS Raju (@MSRajuOfficial) August 13, 2026
ప్రస్తుతం టాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. సమంత ‘మా ఇంటి బంగారం’, రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’, నివేదా థామస్ ‘35’ వంటి చిత్రాలతో ఈ ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ వరుసలో కామాక్షి భాస్కర్ల ‘అగధ’ కూడా చేరి, మహిళా ప్రధాన చిత్రాల విజయ పరంపరను కొనసాగిస్తుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా విభిన్నమైన ప్రపంచాలను అన్వేషిస్తున్న కామాక్షికి ఈ సినిమా ఖచ్చితంగా ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. మహాదేవి పాత్రతో ఆమె ప్రేక్షకుల మనసులను ఏ స్థాయిలో గెలుచుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటల (ఆగస్టు 14) వరకు వేచి చూడాల్సిందే.