Reading Time: < 1 minute
Yash Toxic Movie Actresses Remuneration Nayanthara Kiara Advani

‘టాక్సిక్’ బడ్జెట్ 400 కోట్లని, కాదు కాదు 500 కోట్లని ప్రచారం నడుస్తుంది. ఎంతకు చేరినా ఇందులో నటించిన ఐదుగురు హీరోయిన్లకు 50 కోట్లు ఇచ్చారట! లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ రాసుకున్న ‘టాక్సిక్’ కథకు ఐదుగురు హీరోయిన్లు అవసరమయ్యారు. యష్ సిస్టర్ గా నయనతారకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇక కియారా అద్వానీ రోల్, ఆమె పెర్ఫార్మెన్స్ గురించి నయనతారతో పాటు యష్, గీతు ప్రశంసలు కురిపించారు. కియారా బోల్డ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ‘టాక్సిక్’ ట్రైలర్ చూస్తుంటే హుమా ఖురేషీ నెగిటివ్ రోల్ లో కనిపించింది. యష్ క్యారెక్టర్ ను ఉమనైజర్ గా చూపించారు. తారా సుతారియాతో పాటు రుక్మిణి వసంత్‌తో యష్ రొమాన్స్ చేయనున్నారు.

ఈ ఐదుగురు హీరోయిన్లలో రెమ్యునరేషన్ పరంగా టాప్ ప్లేస్ నయనతారదే! కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ 18 కోట్లు తీసుకుందట. బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘జవాన్’ కోసం 10 కోట్లు డిమాండ్ చేసిన నయన్, సౌత్ లో కొన్నేళ్లుగా హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది. కియారా అద్వానీ రోల్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నా, పారితోషకం విషయంలో సెకండ్ ప్లేస్ లో ఉంది. నయన్ 18 కోట్లు తీసుకుంటే, కియారా రెమ్యునరేషన్ 15 కోట్లని సమాచారం. సాధారణంగా 10 కోట్లు తీసుకునే కియారా, ‘టాక్సిక్’ లో పెర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ తో రెచ్చిపోయింది. తన కెరీర్ ‘టాక్సిక్’ కి ముందు, తర్వాతగా చెప్పుకుంటారని కియారానే ఇందులో క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. ఫస్ట్ టైమ్ 15 కోట్ల మార్క్ దాటేసింది.

రుక్మిణి వసంత్ క్రేజ్ పెరిగిపోయింది, దీనికి తగ్గట్టే రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ రావడంతో సినిమాను బట్టి మూడు నుంచి ఆరు కోట్లు తీసుకుంటుందట. బాలీవుడ్ భామలు తారా సుతారియా, హుమా ఖురేషీకి కూడా ‘టాక్సిక్’ నుంచి బాగానే గిట్టుబాటైంది. ఒకటి రెండు కోట్లు తీసుకునే ఈ ఇద్దరూ, ‘టాక్సిక్’ తో రెండు మూడు కోట్ల హీరోయిన్ల జాబితాలో చేరారు. ఇక స్పెషల్ సాంగ్ తో సంజీదా షేక్ మెరుస్తోంది. ఇలా ‘టాక్సిక్’ ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ 50 కోట్లకు చేరింది.