
Virat Kohli: క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాట్ పట్టి దిగిండంటే చాలు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించడం కింగ్ కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. ఆన్ ఫీల్డ్‌లో సెంచరీలు, రికార్డులు తిరగరాయడమే కాదు, ఆఫ్ ఫీల్డ్‌లో కోట్ల రూపాయల సంపాదన ఆర్జించడంలో, ఆ సంపాదనకు తగ్గట్టుగా దేశానికి నిక్కచ్చిగా పన్ను (ట్యాక్స్) కట్టడంలోనూ తానే నంబర్-1 అని నిరూపించుకున్నడు. ఎంత సంపాదిస్తే అంత బాధ్యతగా పన్ను చెల్లించి దేశ పురోగతికి తోడ్పడటంలోనూ కోహ్లీ అందరికీ రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు.
రూ. 66 కోట్ల ట్యాక్స్ చెల్లింపులు:
భారతదేశంలో ఎంతోమంది సినిమా స్టార్ల నుంచి వ్యాపారవేత్తల దాకా భారీగా సంపాదిస్తుంటారు. కానీ స్పోర్ట్స్ కేటగిరీకి వచ్చేసరికి మాత్రం విరాట్ కోహ్లీ కొట్టిన దెబ్బకు మిగతా ప్లేయర్లంతా ఆమడ దూరంలో ఉండిపోయిండ్రు. కాగా కోహ్లీ భయ్యా 2023–24 ఏడాదికి గానూ ఏకంగా 66 కోట్ల రూపాయిలని పన్ను రూపంలో సర్కార్‌కి చెల్లించి, భారత క్రీడారంగంలోనే అత్యధిక ట్యాక్స్ కట్టిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
స్పోర్ట్స్ స్టార్లలో కోహ్లీదే అగ్రపీఠం:
భారతీయ క్రీడాకారుల జాబితాలో కోహ్లీ తర్వాత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రూ. 38 కోట్లు, సచిన్ టెండూల్కర్ రూ. 28 కోట్లు, సౌరవ్ గంగూలీ రూ.23 కోట్లు పన్నుగా చెల్లించారు. సినీ నటులు, క్రీడాకారులు అందరినీ కలిపి చూస్తే అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, విజయ్, సల్మాన్ ఖాన్ తర్వాత విరాట్ కోహ్లీ 5వ స్థానంలో కొనసాగుతుండటం విశేషం.
►ALSO READ | భారత్‌తో సిరీస్ ఆడాలని చూస్తుంటే.. ఈ ఆఫ్ఘన్ జట్టు వచ్చి చెడగొట్టింది.. ఇబ్బందుల్లో బంగ్లాదేశ్!
2025–26 ట్యాక్స్ మరి?:
మరి 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇంకా ఏమైనా కొత్త రికార్డులు వచ్చినయా అని ఆరా తీస్తే.. ఐటీ డిపార్ట్‌మెంట్ (ఆదాయపన్ను శాఖ) ఎప్పుడూ విడిగా ప్రైవేట్ వ్యక్తుల ర్యాంకింగ్ లిస్ట్ బయట పెట్టదు. కానీ ఇప్పటిదాకా నమోదైన అధికారిక అడ్వాన్స్ ట్యాక్స్ వివరాల ప్రకారం చూస్తే మాత్రం విరాట్ కోహ్లీ అన్న కట్టిన 66 కోట్ల రూపాయిలే స్పోర్ట్స్ పర్సన్స్ అందరిలోనూ ఆల్ టైమ్ హైయెస్ట్.
కోహ్లీ ఆదాయ మార్గాలు:
* బీసీసీఐ, ఐపీఎల్ జీతాలు: బీసీసీఐ ఏ+ కాంట్రాక్ట్‌తో పాటు ఐపీఎల్‌లో ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీ వేతనం.
* బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్: ప్యూమా (Puma), ఎంఆర్‌ఎఫ్ (MRF), ఆడి (Audi) లాంటి అంతర్జాతీయ బ్రాండ్ల ప్రకటనలు.
* వ్యాపారాలు, సోషల్ మీడియా: సొంత బ్రాండ్ One8 వ్యాపారాలు, రెస్టారెంట్లు, ఇన్‌స్టాగ్రామ్ స్పాన్సర్డ్ పోస్టుల ఆదాయం.
క్రీడాకారుడు చెల్లించిన పన్ను స్థానం
విరాట్ కోహ్లీ ₹66 కోట్లు స్పోర్ట్స్‌లో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్
ఎంఎస్ ధోనీ ₹38 కోట్లు క్రీడాకారుల్లో 2వ స్థానం
సచిన్ టెండూల్కర్ ₹28 కోట్లు క్రీడాకారుల్లో 3వ స్థానం
సౌరవ్ గంగూలీ ₹23 కోట్లు క్రీడాకారుల్లో 4వ స్థానం
హార్దిక్ పాండ్యా ₹13 కోట్లు క్రీడాకారుల్లో 5వ స్థానం