
ప్రఖ్యాత నటి వై విజయ.. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు వై విజయ. మొన్న మధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్ 3సినిమాల్లో నటించారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, తనను ప్రభావితం చేసిన వ్యక్తులను తాజాగా పంచుకున్నారు. ఆమె తన బాల్యం, కుటుంబ నేపథ్యం, సినీ రంగంలోకి ప్రవేశించిన తీరు, ప్రముఖ దర్శకులు ఎన్.టి. రామారావు, కె.వి. రెడ్డి, కె. బాలచందర్‌ల ప్రభావం గురించి వివరించారు. వై విజయ చిన్నతనంలోనే నాట్య కళాకారిణిగా శిక్షణ పొందారు. తన తండ్రి విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారని, తాను పాఠశాలలో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచేదానినని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఆమెను “ఇందిరా గాంధీ వలె తెలివైన అమ్మాయి” అని ప్రశంసించేవారని తెలిపారు. డాన్స్ అరంగ్రేటం తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించినప్పటికీ, తొలుత ఆమెకు సినిమా అంటే ఏమిటో పెద్దగా అవగాహన ఉండేది కాదు. అప్పటికే రామకృష్ణ, శోభన్ బాబు వంటి వారితో 20-25 మలయాళ చిత్రాల్లో నటించారు. అయితే, హీరోయిన్‌గా వెళ్లాలనే ఆసక్తి గానీ, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదని ఆమె చెప్పారు. సినిమా అంటే డాన్స్, కొన్ని సన్నివేశాలు అనే స్థాయిలోనే చూసేవారట. తన తండ్రి పంపిన డబ్బులతో అద్దె, భోజనం చూసుకుంటూ సంతోషంగా గడిచిపోయేదని తెలిపారు.
ఇది కూడా చదవండి : అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..! ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
ఆమె జీవితంలో కీలక మలుపుగా కె. బాలచందర్ గారి అవల్ ఒరు తొడర్ కథై చిత్రం వంద రోజుల వేడుకను పేర్కొన్నారు. ఈ వేడుకకు తాను ఆహ్వానించబడినప్పుడు, రాజ్ కపూర్ వంటి గొప్ప తారలు బాలచందర్‌ను పొగుడుతుంటే, దర్శకుడికి ఇంత విలువ ఉంటుందా అని ఆశ్చర్యపోయానని అన్నారు. ఈ సంఘటనకు ముందు, ఎన్.టి. రామారావు గారు ఒక సందర్భంలో తనను దర్శకుడు కె.వి. రెడ్డి గురించి చెప్తూ.. ఆయన గొప్ప దర్శకుడని, వెళ్లి కళ్ళకు నమస్కరించమని చెప్పారని ఆ విషయం తనకు దర్శకుల ప్రాముఖ్యతపై మొదటి అవగాహన కల్పించిందని అన్నారు. రామారావు గారి మాట, బాలచందర్ గారి సన్మానం, ఈ రెండు సంఘటనలు దర్శకుల పాత్రను, వారి గౌరవాన్ని ఆమెకు తెలియజేశాయి.
ఇది కూడా చదవండి : సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున
ఈ వేడుక తర్వాత కొద్ది కాలానికే బాలచందర్ గారి ఆఫీస్ నుండి పిలుపు వచ్చింది. ఎప్పుడూ ఏ ఆఫీస్ కు వెళ్లని తాను, బాలచందర్ గారి కార్యాలయానికి భయపడుతూ వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. మొదట జయవిజయ పాత్రకు ఎంపిక చేసినా, ఆ తర్వాత హలో మై డియర్ రాంగ్ నెంబర్ సినిమాలో అవకాశం వచ్చింది. కమల్ హాసన్‌తో కలిసి సాంగ్ షూటింగ్‌తో ఆమె తొలిరోజు చిత్రీకరణ ప్రారంభమైంది. బాలచందర్ సెట్‌లో నెలకొన్న నిశ్శబ్దం, ఆయన క్రమశిక్షణ, నటీనటుల అంకితభావం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. కెమెరాను మర్చిపోయి, సహజంగా నటించడం, సమయపాలన, అంకితభావం వంటి అనేక విషయాలను తాను బాలచందర్ గారి వద్దే నేర్చుకున్నానని విజయ వివరించారు. ఈ అనుభవంతోనే సినిమా అంటే ఏమిటి, కెమెరా అంటే ఏమిటి అనే లోతైన అవగాహన తనకు ఏర్పడిందని, తద్వారా దర్శకత్వంపై కూడా ఆసక్తి పెరిగిందని వై విజయ తెలిపారు.
ఇది కూడా చదవండి : అయ్యో పాపం.. కళ్ళు చిదంబరం కళ్ళ వెనక ఇంతా కథ ఉందా.! తెలిస్తే షాక్ అవుతారు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.