
దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడు హుండీలో డబ్బులు వేయడం ఆనవాయితీ. కోర్కెలు తీర్చమనో.. తీరిన కోరికలకు కృతజ్ఞతతోనో.. భక్తులు హుండీల్లో డబ్బులు వేస్తుంటారు. ఇక్కడ ఎలాంటి బలవంతం ఉండదు. అది భక్తుల నమ్మకంతో కూడుకున్న ఆచారం.
అలాంటిది కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు బయట పడటం ఆ దేవునికి కూడా షాకింగ్ న్యూసే అయి ఉంటుంది. ఎవరైనా కోర్కెలు తీర్చమనో.. తీర్చిన కోరికలకో.. లేక ఆత్మ సంతృప్తికో మనస్ఫూర్తిగా దేవునికి కానుకలు సమర్పిస్తారు. మరి ఈ డమ్మీ నోట్ల కట్టలు వేసిన భక్తుల ఎలాంటి ఉద్దేశంతో వేశారో అర్థం కాని విషయం.
ALSO READ : జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు..
2026 ఆగస్టు 12న కొండగట్టు అంజన్న దేవస్థానం హుండీ లెక్కింపు జరిపారు. ఈ లెక్కింపులో రెండు లక్షల 50 వేల విలువైన డమ్మీ నోట్ల కట్టలను గుర్తించారు సిబ్బంది. డమ్మీ నోట్లు బయటపడటంతో పై అధికారులకు సమాచారం అందించారు. వాటిని వేరు చేసి లెక్కింపు కొనసాగించారు.