Reading Time: < 1 minute
Viral Video: గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు!

మహారాష్ట్రాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులు ముంబైలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా బుధవారం తెల్లవారుజామున ముంబైలోని కుర్లా ప్రాంతాల్లో ఒక్కసారిగా కొండచరియలు విరిగి నివాస ప్రాంతాలపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు ఇద్దరు మృతి చెందినట్టు ఇప్పటివరకు రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. అలాగే 6 నుంచి 8 మంది వరకు గాయపడ్డారని.. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలా కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికి తీశామని.. మరణించిన వారిని సాహిల్ అన్సారీ (28), మొహమ్మద్ సమీర్ (14) గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అలాగే సోహెల్ అన్సారీ (18), మొహమ్మద్ అన్సారీ (14) అనే మరో ఇద్దరిని కుర్లా భాభా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. ప్రస్తతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

నివేదికల ప్రకారం.. ఈ ప్రమాదం ఉదయం 3:48 గంటల ప్రాంతాల్లో జరిగి ఉంటుందని.. అయితే ఈ సమయంలో ప్రజలు గాడ నిద్రలో ఉండడం కారణంగా ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయినట్టు తెలుస్తోంది.

వీడియో ఇక్కడ చూడండి.. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.