Reading Time: < 1 minute

అప్పుడు లబ్ది పొంది ..ఇప్పుడు సంబంధం లేదంటరా?..రామాలయం అంశంపై కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ

Caption of Image.

న్యూఢిల్లీ: రామాలయ విరాళాల సొమ్ము దుర్వినియోగంపై కేంద్రం పార్లమెంటులో జవాబు చెప్పకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్‌‌‌‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. ఈ అంశం రాష్ట్ర పరిధిలోనిదంటున్న బీజేపీ.. లోక్‌‌‌‌సభ ఎన్నికల ముందు రామాలయం పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు మాత్రం వెనుకాడలేదని ఆరోపించారు.

 దేశవ్యాప్తంగా ప్రజలు భక్తితో తమకు తోచినంత సొమ్ము ఇచ్చారని గుర్తుచేశారు. రాముడిపై భారత్‌‌‌‌తో పాటు మలేసియా, ఇండోనేసియా, థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ దేశాల్లోనూ ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. రామాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని, ఆయన ఒక రాష్ట్రానికి కాదు దేశానికి ప్రధానమంత్రి అని గుర్తుచేశారు.

©️ VIL Media Pvt Ltd.