
Hardik Pandya: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కి ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ట్రేడింగ్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మను పక్కనపెట్టి మరీ కెప్టెన్సీ పీఠం ఎక్కినప్పటి నుంచి హార్దిక్‌కు అసలు గ్రహచారం బాగున్నట్లు లేదు. అభిమానుల ట్రోలింగ్, జట్టు వరుస ప్లాప్ పర్ఫార్మెన్స్‌లతో విసిగిపోయిన మనోడు.. ఇక్కడ మన పప్పులు ఉడకవు బాసూ అని ఫిక్స్ అయిపోయాడట. అందుకే సైలెంట్‌గా ముంబై గుమ్మం దాటి చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) దగ్గరకు వెళ్లి రాయబారాలు నడిపాడని టాక్ వినిపిస్తోంది.
కెప్టెన్సీ సీటే కావాలంటే ఎలా?:
ఇక ఈ హడావుడి మధ్యలో తను గతంలో కప్పు గెలిపించిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వైపు కూడా ఓ చూపు చూశాడు. గుజరాత్ యాజమాన్యం కూడా సరేలే పాపం, పాత కుర్రాడేగా తీసుకుందామని ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ని అడిగితే.. గిల్ కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు భయ్యా, రానివ్వండి అని పెద్ద మనసు చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ ఇక్కడే మనోడి అసలు ఈగో బయటపడింది.. నేను రావాలంటే నాకు మళ్లీ గుజరాత్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని కండిషన్ పెట్టాడట. దెబ్బకి గుజరాత్ మేనేజ్‌మెంట్ బాబోయ్.. ఈ పాత డ్రామా మాకొద్దు బాసు, నీకు దండం అంటూ డోర్లు పాండ్యా ముందేసేసింది.
►ALSO READ | నేషనల్ హాకీ చాంపియన్‌షిప్ బరిలో 30 జట్లు
నాకేమీ తెలీదురా బాబోయ్: మేనేజర్
ఈ రచ్చంతా మీడియాలో హాట్ టాపిక్‌గా మారేసరికి, హార్దిక్ పాండ్యా మేనేజ్‌మెంట్ టీమ్ రంగంలోకి దిగి ఒక రేంజ్ కవర్ డ్రైవ్ ఇచ్చింది. అసలు హార్దిక్ ఏ ఫ్రాంచైజీతోనూ మాట్లాడలేదు, ట్రేడింగ్ కథలన్నీ రూమర్లే. ఏమైనా ఉంటే ముంబై యాజమాన్యమే చూసుకుంటుందని చాలా అమాయకంగా చేతులు దులిపేసుకుంది. 2022లో గుజరాత్‌ను చాంపియన్‌గా నిలబెట్టి, 2023లో ఫైనల్‌కు తీసుకెళ్లిన రోజుల్లో హార్దిక్ హీరోనే. కానీ ముంబైకి వెళ్లాక ఫ్యాన్స్ నుంచి వచ్చిన వ్యతిరేకత, ఇప్పుడు ఏ జట్టుకెళ్లినా కెప్టెన్సీ ఇస్తేనే వస్తా అని కండిషన్లు పెట్టడం చూస్తుంటే సోషల్ మీడియాలో నెటిజన్లకు నవ్వు ఆగడం లేదు.
🚨 GT REJECTED HARDIK PANDYA TRADE
Hardik Pandya discussed a possible return to Gujarat Titans but GT rejected the move because Hardik wanted to be made captain again as a condition for returning.
(Indian Express) pic.twitter.com/FpamiTuD8w
— Kartik Sharma (@KartikSharmaFC) August 12, 2026