Reading Time: 2 minutes

ఆగస్టు 14 నుంచి టీ 20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్లు.. ఈ చిన్న దేశాల మధ్యనే గట్టి పోటీ

Caption of Image.

T20 World Cup Qualifiers: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2028 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ సంచలన మార్పులు చేసింది. టోర్నమెంట్‌లో ఉత్కంఠను పెంచేందుకు, వర్ధమాన (Associate) దేశాలకు ప్రపంచ వేదికపై మరిన్ని అవకాశాలు కల్పించేలా సరికొత్త ఫార్మాట్‌ను రూపొందించింది. 20 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో సూపర్ 10, ఎలిమినేటర్స్ రౌండ్లను కొత్తగా ప్రవేశ పెట్టింది. 

సరికొత్త ఫార్మాట్: 
పాత ఫార్మాట్ స్థానంలో మ్యాచ్ మ్యాచ్‌కూ తీవ్ర పోటీ ఉండేలా ఈ కొత్త విభాగాలు తీసుకువచ్చారు. 

* గ్రూప్ దశ (30 మ్యాచ్‌లు): 20 జట్లను నాలుగు జట్ల చొప్పున 5 గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 సాధించిన జట్లు సూపర్ 10కి చేరుకుంటాయి.

* సూపర్ 10 (20 మ్యాచ్‌లు): 10 జట్లను 5 చొప్పున రెండు గ్రూపులుగా విభజించి రౌండ్-రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. రెండు గ్రూపుల విజేతలు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.

* ఎలిమినేటర్స్ (2 మ్యాచ్‌లు): సూపర్ 10లో ప్రతి గ్రూప్‌లోని 2వ స్థానంలో నిలిచిన జట్లు, మరో గ్రూప్‌లోని 3వ స్థానంలో ఉన్న జట్లతో తలపడతాయి. ఇందులో విజేతలుగా నిలిచే రెండు జట్లు మిగిలిన రెండు సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకుంటాయి.

2028 టోర్నీకి నేరుగా అర్హత సాధించిన 12 జట్లు: 
2026 టీ20 ప్రపంచకప్ ప్రదర్శన, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా 12 జట్లు ఇప్పటికే 2028 టోర్నమెంట్‌కు నేరుగా తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి: ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్ట్ ఇండీస్ లేదా జింబాబ్వే.

క్వాలిఫైయర్స్ షెడ్యూల్ ఇదే: 
టీ20 వరల్డ్ కప్ లో మిగిలిన 8 స్థానాల కోసం అర్హత ప్రక్రియను ఐసీసీ మరింత ఆసక్తికరంగా డిజైన్ చేసింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

* నేరుగా గ్లోబల్ క్వాలిఫైయర్: 2026లో ఆడి నేరుగా అర్హత పొందని కెనడా, ఇటలీ, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమన్, యూఏఈ, యూఎస్‌ఏ జట్లు నేరుగా గ్లోబల్ క్వాలిఫైయర్ ఆడుతాయి.

* రీజినల్ క్వాలిఫికేషన్: ప్రాంతీయ టోర్నీల ద్వారా మరో 8 జట్లు (ఆఫ్రికా-2, ఆసియా-2, యూరప్-2, అమెరికాస్-1, ఈఏపీ-1) గ్లోబల్ క్వాలిఫైయర్‌లో ఎంట్రీ ఇస్తాయి. ఇక స్కాట్లాండ్ నేరుగా యూరప్ రీజినల్ ఫైనల్ ఆడుతుంది. 

* ఆఫ్రికా (Africa)– ఉగాండా, కెన్యా, టాంజానియా, నైజీరియా, రువాండా, నమీబియా
* ఆసియా (Asia)– నేపాల్, ఒమన్, యూఏఈ (UAE), హాంకాంగ్, మలేషియా, కువైట్, బహ్రెయిన్
* యూరప్ (Europe)– స్కాట్లాండ్, జెర్సీ, డెన్మార్క్, ఇటలీ, జర్మనీ, గ్వెర్న్సీ, పోర్చుగల్
* తూర్పు ఆసియా-పసిఫిక్ (EAP)– పాపువా న్యూ గినియా (PNG), జపాన్, వనౌటు, ఫిజి, దక్షిణ కొరియా, ఇండోనేషియా
*అమెరికాస్ (Americas)– కెనడా, యూఎస్‌ఏ (USA), బెర్ముడా, కేమాన్ ఐలాండ్స్, అర్జెంటీనా

©️ VIL Media Pvt Ltd.