ప్రజా ఆరోగ్యంపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఈ బ్యాన్ కింద ఏమేం నిషేధించారు? అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి..
ప్రభుత్వం కీలక నిర్ణయం: కర్ణాటక ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పొగాకు, నికోటిన్ ఉన్న గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తులను నిషేధిస్తూ ఆరోగ్య శాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

ఏడాది పాటు కఠిన ఆంక్షలు: ఈ నిషేధం కేవలం అమ్మకాలకే పరిమితం కాలేదు. గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తుల తయారీ, నిల్వ చేయడం, రవాణా చేయడం మరియు విక్రయించడంపై ఏడాది పాటు కఠినమైన ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇక ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
ఇతర పొగాకు ఉత్పత్తులపైనా నిఘా: కేవలం పాన్ మసాలా మాత్రమే కాకుండా, పొగాకు లేదా నికోటిన్ కలిగిన ఏ ఇతర ఉత్పత్తులకైనా ఈ నిషేధం వర్తిస్తుందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రజారోగ్యానికి హాని కలిగించే ప్రతీ ప్రత్యామ్నాయ ఉత్పత్తిపై కూడా ప్రభుత్వం నిఘా ఉంచనుంది.
చిన్న చిన్న అలవాట్లు ప్రాణాల మీదకు తెచ్చే ఈ రోజుల్లో, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజారోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్యతో గుట్కా, పాన్ మసాలా వాడకం తగ్గుతుందని భావిస్తున్నారు.
గమనిక: పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులు आरोग్యానికి అత్యంత ప్రమాదకరం. ఆరోగ్యకరమైన సమాజం కోసం వీటిని దూరంగా ఉంచడం మన అందరి బాధ్యత.
The post ఆ రాష్టం లో సర్కార్ కీలక నిర్ణయం.. గుట్కా, పాన్ మసాలా విక్రయాలపై బ్యాన్! appeared first on Manalokam – Latest Telugu News & Updates.