
రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈనెల 21న సినిమా విడుదల కానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది.
ట్రైలర్ ఎలా ఉందంటే..
భార్య, కూతురును ఎంతో ప్రేమగా చూసుకునే మిడిల్ క్లాస్ ఫాదర్‌గా రవితేజ కనిపించాడు. ఊరిలోని ప్రతి అమ్మాయిని కూడా తన కూతురిలా భావిస్తాడు. తాగుడు వ్యసనానికి బానిసైన అతను ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకుని, పూర్తిగా ప్రశాంతమైన, భిన్నమైన వ్యక్తిగా మారతాడు.
మరోవైపు ఆ ఊర్లో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలకు కారణం ఎవరు.. వాటిని అతను ఎలా అడ్డుకున్నాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఏపీలోని భీమవరంలో జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ ‘అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా సంతోషంగా ఉంది. సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉంది. ఈ వైబ్‌ను ఇలాగే కంటిన్యూ చేద్దాం’ అని చెప్పాడు.
‘ఇరుముడి’ టైటిల్ వెనుక సీక్రెట్?
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ని వెల్లడించాడు. ఈ కథలో మూడు ప్రధానమైన ముడులు (Layers) ఉన్నాయని ఆయన తెలిపారు. అందులో ఒకటి ‘‘ఇరుముడి’ అంటే ఇద్దరికి పడిన ముడి లేదంటే రెండు ముడులు. మరొకటి తండ్రికి కూతురుకి మధ్య పడిన ముడి, మూడోది అయ్యప్పకు భక్తుడికి మధ్య పడిన ముడి, సినిమాలోని క్రైమ్ చిక్కుముడి కలిపి ఈ సినిమాకు ‘ఇరుముడి’ టైటిల్ పెట్టాను.
అయితే, ఇప్పటివరకు ‘‘చాలా మంది ఇది భక్తి సినిమా అని, శబరిమల వెళ్తారని, ఏదో సినిమాకు రీమేక్ అని రకరకాలుగా వచ్చాయి. అప్పుడే సమాధానం చెప్పొచ్చు. కానీ అది రైట్ టైమ్ లో కంటెంట్ తో మాత్రమే చెప్తే బాగుంటుందని ఆగా. ఇప్పుడు ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుందనే క్లారిటీ వచ్చిందనుకుంటా’’ అని శివ నిర్వాణ వెల్లడించారు.
ఇందులోని ఇంటెన్సిటీ సర్‌ప్రైజ్ చేస్తుంది. రవితేజ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఇదొక సినిమా కాదు.. గొప్ప ఎమోషన్’ అని శివ చెప్పుకొచ్చాడు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇది చాలా పెద్ద రేంజ్‌కి వెళ్తుందని నమ్ముతున్నట్టు నిర్మాత వై రవిశంకర్ చెప్పారు. హీరోయిన్ ప్రియ భవానీ శంకర్, బేబీ నక్షత్ర సహా టీమ్ అంతా పాల్గొన్నారు.