Reading Time: < 1 minute
The Top 10 Highest Grossing Telugu Films Worldwide This Year

2026 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటుకుంది. బారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ల నుంచి కమర్షియల్, ఫ్యామిలీ డ్రామాల వరకు పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల జాబితాలో ‘పెద్ది’ మొదటి స్థానంలో నిలవగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు’ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

2026 ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ టాప్ 10 సినిమాలు :

  సినిమా  ప్రపంచవ్యాప్త వసూళ్లు ( రుపాయాలలో)
1 పెద్ది  ₹335.03 కోట్లు
2 మన శంకర వరప్రసాద్ గారు  ₹300.79 కోట్లు
3 ది రాజా సాబ్  ₹206.57 కోట్లు
4 మా ఇంటి బంగారం  ₹100.96 కోట్లు
5 ఉస్తాద్ భగత్ సింగ్  ₹97.25 కోట్లు
6 అనగనగా ఒక రాజు  ₹83.85 కోట్లు
7 లెనిన్  ₹68.88 కోట్లు
8 డకాయిట్ ₹56.88 కోట్లు
9 చెన్నై లవ్ స్టోరీ  ₹50.91 కోట్లు
10 నారీ నారీ నడుమ మురారి ₹38.74 కోట్లు

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల క్లబ్‌లో రెండు తెలుగు సినిమాలు చేరి సంచలనం సృష్టించాయి. రూ. 335.03 కోట్ల వసూళ్లతో ‘పెద్ది’ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ రూ. 300.79 కోట్లు కొల్లగొట్టి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ రూ. 206.57 కోట్లతో మూడో స్థానంలో నిలవగా, రూ. 100 కోట్ల మైలురాయిని దాటి ‘మా ఇంటి బంగారం’ నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘అనగనగా ఒక రాజు’, ‘లేనిన్’, ‘డకాయిట్’ వంటి చిత్రాలు కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించి టాలీవుడ్ స్థాయిని మార్కెట్‌లో మరింత పెంచాయి.