Reading Time: < 1 minute
Nalsar 2026 Graduates Bci Advocate Enrolment Cji Surya Kant Row

NALSAR row: హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) మరోసారి వార్తల్లో నిలిచింది. 2026లో న్యాయ విద్య పూర్తి చేసిన విద్యార్థులను అడ్వొకేట్లుగా ఎన్‌రోల్ చేయడాన్ని బార్ కౌన్సి్ల్ ఆప్ ఇండియా (BCI) తాత్కాలికంగా నిలిపివేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను యూనివర్సిటీ కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామం తర్వాత బార్ కౌన్సిల్ నుంచి ఈ ఆదేశాలు రావడం గమనార్హం.

గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో 2026లో NALSAR నుంచి లా డిగ్రీ పొందిన ఏ విద్యార్థినీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా అడ్వొకేట్‌గా ఎన్‌రోల్ చేయరాదని BCI స్పష్టం చేసింది. ఈ దేశాలతో ఈ ఏడాది న్యాయ పట్టాలు పొందిన విద్యార్థుల న్యాయవృత్తి ప్రవేశంపై అనిశ్చితి ఏర్పడింది.

నల్సార్ వైస్‌ఛాన్సలర్‌ నుంచి నివేదిక కోరిన BCI..

కాన్వొకేషన్‌కు సంబంధించిన వివాదంపై నల్సార్ వైస్ ఛాన్సలర్ నుంచి BCI నివేదిక కోరింది. BCI ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు అడ్వొకేట్ వీపీ శర్మ, కమిటీ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల విషయంలో క్రమశిక్షణ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి యూనివర్సిటీ నుంచి మాత్రమే నివేదిక కోరామని, విచారణలో క్రమశిక్షణ ఉల్లంఘించలేదని తేలితే ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపారు. బీసీఐ నిర్ణయాన్ని సవాల్ చేయాలనుకునే వారికి ఆ అవకాశం కూడా ఉందని తెలిపారు.

CJI సూర్యకాంత్ ఆహ్వానాన్ని వ్యతిరేకించిన 450 మంది విద్యార్థులు:

నల్సార్ 2026 బ్యాచ్‌కు చెందిన 450 మందికి పైగా విద్యార్థులు యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, ఇతర అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. 2026 కాన్వొకేషన్‌కు CJI జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు కోరారు. యువతను బొద్దింకలుగా పోల్చడాన్ని, జంతర్ మంతర్ నిరసలన సమయంలో పోలీసులు చర్యలు చూసేందుకు సమయం లేదని చెప్పడంపై సీజేఐ తీరును తప్పుబడుతున్నారు.