Reading Time: < 1 minute

పోలీసునే కత్తితో పొడుస్తానని బెదిరించాడు.. ఏపీలోని శ్రీకాళహస్తిలో షాకింగ్ ఘటన

Caption of Image.

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి హెడ్ కానిస్టేబుల్పై యువకులు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన వీడియో వైరల్ అయింది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో సెల్ ఫోన్ చోరీకి సంబంధించి విచారణకు వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్పై ఇద్దరు యువకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

హెడ్ కానిస్టేబుల్ వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో 2 బైకులు ఢీ కొన్నాయి. ఆ రెండు బైకుల్లో ఒక బైక్ డ్రైవ్ చేసిన నిందితుడిని ఎందుకిలా చేశాని, ఓవర్ స్పీడ్ ఎందుకని కానిస్టేబుల్ అడిగాడు. నిందితుడు శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై దాడి చేసి, కత్తితో దాడి చేస్తానని బెదిరించాడు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డ్ కావడం గమనార్హం.

హెడ్ కానిస్టేబుల్ రమణయ్య భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపారు. నిందితుడు శ్రీనివాసులుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. రమణయ్య ఫిర్యాదుతో శ్రీనివాసులు, అతనితో పాటు హెడ్ కానిస్టేబుల్ను బెదిరించిన జితేంద్రపై కేసు నమోదు చేశారు. శ్రీనివాసులును కోర్టుకు తీసుకెళ్లే ముందు శ్రీకాళహస్తి వీధుల్లో పోలీసులు నడిపించారు. కోర్టులో హాజరుపరిచారు.

©️ VIL Media Pvt Ltd.