
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున జోరు చూస్తుంటే వచ్చే రెండేళ్ల పాటు బాక్సాఫీస్ వద్ద అన్నపూర్ణ స్టూడియోస్ హవా గట్టిగానే ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా జరిగిన ఓ వేడుకలో నాగ్ మాట్లాడిన మాటలు, చేసిన ప్రకటనలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు కింగ్.
తమిళ దర్శకుడు రా. కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గతకొన్ని నెలలుగా నాగార్జున 100వ సినిమా టైటిల్పై వినిపిస్తున్న రూమర్స్కు తాజాగా నాగ్ కామెంట్స్తో ఎండ్ కార్డ్ పడిందని అంటున్నాయి సినీ వర్గాలు. దీంతో అక్కినేని అభిమానుల్లో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది.
‘కింగ్ 100’ టైటిల్‌పై జోరుగా చర్చ..
రాబోయే రెండేళ్లపాటు తమ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ చాలా బిజీగా ఉండబోతోందని నాగార్జున స్పష్టం చేశారు. కేవలం ఒకరిద్దరితో కాకుండా, వరుస సినిమాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే నాగ్ తన కెరీర్‌లోని మైలురాయి సినిమా అయిన 100వ ప్రాజెక్ట్ గురించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు.
నాగార్జున వందో సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు ‘కింగ్ 100’ అనే టైటిల్ ఖరారైనట్లు ప్రచారం ఊపందుకుంది. అన్నపూర్ణ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాగ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సీక్రెట్‌గా సాగుతున్న షూటింగ్..
‘నాగ్ 100’ సినిమా అనగానే.. డైరెక్టర్గా కార్తీక్, విలన్గా టబు అని మాత్రమే ఆడియన్స్కు తెలుసు. మిగతా ఏ విషయాల్లో లీకులు లేవు. షూటింగ్ పూర్తయ్యే వరకు సినిమాకు సంబంధించిన కీలక వివరాలు బయటకు రాకుండా నాగార్జున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ కూడా షూటింగ్ మరియు సినిమా జానర్ గురించి అత్యంత సీక్రెట్ మెయింటేన్ చేస్తూ వస్తుంది.
►ALSO READ | పుట్టిన గడ్డపైనే నా ఓటు తీసేశారు..గేమ్ మొదలైందంటూ ప్రకాశ్ రాజ్ వీడియో
షూటింగ్ పూర్తయ్యాక భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించాలనే ప్లాన్‌లో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అభిమానులు ఎదురుచూస్తున్న అధికారిక అప్డేట్ త్వరలోనే రానుంది.
నాగార్జున సెంటిమెంట్ రిపీట్..
కింగ్ నాగార్జున తన 100వ మైలురాయి చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో మన్మథుడు, మాస్, కింగ్, ఢమరుఖం వంటి సినిమాలకు DSP సంగీతం అందించి.. నాగ్కి సూపర్ సక్సెస్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే కింగ్ 100 మూవీకి DSP అయితేనే.. అక్కినేని ఫ్యాన్స్ ఆకలి తీర్చుతాడానికి నాగ్ భావించడంతో.. రాక్ స్టార్ ని రంగంలోకి దింపాడని టాక్. ముఖ్యంగా నాగార్జున స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా మాస్‌తో పాటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే సంగీతాన్ని అందించే సామర్థ్యం DSPకే ఉందని నాగార్జున నమ్ముతున్నారని టాక్.