Reading Time: 2 minutes
Lava Smart 4 Launched At Rs 8499 With 90hz Display 5000mah Battery And Military Grade

Lava Smart 4 Launched: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) భారత మార్కెట్లో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే లాంచ్ చేసిన లావా స్మార్ట్ 4 ప్లస్ (Lava Smart 4 Plus) తర్వాత తాజాగా లావా స్మార్ట్ 4 (Lava Smart 4) ను తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ వినియోగదారులు, తొలిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో పెద్ద డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 5000mAh బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది.

ఈ కొత్త మొబైల్ లో 6.56 అంగుళాల QHD LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 960 × 540 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. సాధారణ 60Hz డిస్‌ప్లేలతో పోలిస్తే స్క్రోలింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా అందించనుంది.

ఈ బడ్జెట్ ఫోన్‌లో 1.6GHz ఆక్టా-కోర్ UNISOC SC9863A ప్రాసెసర్, IMG8322 GPU ఉన్నాయి. దీనికి 3GB RAMతో పాటు మరో 3GB వర్చువల్ RAM ఎక్స్‌పాన్షన్ సపోర్ట్ కూడా ఉంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇందులో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 8MP కెమెరా, LED ఫ్లాష్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. బడ్జెట్ విభాగాన్ని దృష్టిలో ఉంచుకుని కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే ఈ బిడ్జిట్ మొబైల్ లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 10W ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం USB టైపు-C పోర్ట్‌ను అందించారు. పెద్ద బ్యాటరీ కారణంగా సాధారణ వినియోగంలో ఎక్కువ బ్యాకప్ అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది.

Image

ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో, బాటమ్-ఫైరింగ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 4.2, GPS కనెక్టివిటీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. దీని ద్వారా ఫోన్ నిర్మాణం, డ్యూరబిలిటీపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

ఈ కొత్త లావా స్మార్ట్ 4 ధరను భారత మార్కెట్లో రూ.8,499గా నిర్ణయించారు. ఇది కోణార్క్ గోల్డ్, అజంతా గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్‌ను లావా రిటైల్ అవుట్‌లెట్లతో పాటు ఎంపిక చేసిన సర్వీస్ ప్రొవైడర్ నెట్‌వర్క్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో ఫైనాన్సింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.