
దిన ఫలాలు (ఆగస్టు 13, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు సానుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామికి కూడా సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు సానుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసు కుంటే మంచిది. ఇంటా బయటా శ్రమ, తిప్పట ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహా రాలు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా పురోగమిస్తుంది. ఎంత ఒత్తిడి ఉన్నా కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామికి వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహ రించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో కొనసాగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆశిం చిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధువులతో కొద్దిగా అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూ లంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ బాగా పెరుగు తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందజేయాల్సి వస్తుంది. బంధువుల నుంచి కొద్దిగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు దర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. లాభాల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగ జీవి తం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి అను కోని అదృష్టం పడుతుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలాలు అందుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో జీవిత భాగస్వామికి అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధాసక్తులు పెంచాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కానీ, ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఘన విజ యాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో జీవిత భాగస్వామి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు విస్తరిస్తాయి. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా అందవచ్చు. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశాల్లో స్థిర పడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. అధికారుల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అను కోకుండా పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.