
వాహన తయారీ సంస్థ మహీంద్రా పలు విభాగాలలో వాహనాలను విక్రయిస్తుంది. అయితే త్వరలో మహీంద్రా విజన్ ఎస్ అనే కొత్త ఎస్‌యూవీని పరిచయం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. మరి దీని ఫీచర్లు, లాంచ్ తేదీ సహా ఎక్స్ షోరూం ధరల గురించి తెలుసుకుందామా….
మహీంద్రా విజన్ ఎస్
మహీంద్రా త్వరలో విజన్ ఎస్ అనే కొత్త ఎస్‌యూవీని విడుదల చేయడానికి రెడీ అవుతుంది. అయితే, కంపెనీ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
ఫీచర్లు ఎలా ఉంటాయంటే
మహీంద్రా ఈ SUVలో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, అడ్జస్ట్ చేయగల హెడ్‌రెస్ట్, ఫోల్డబుల్ బ్యాక్ ఆర్మ్‌రెస్ట్, LED లైట్లు, బ్యాక్ డిఫాగర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించవచ్చు.
ఇంజిన్ పవర్
ఈ SUV గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, దీనిలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ అప్షన్స్ ఉంటాయని భావిస్తున్నారు. 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 131 హార్స్‌పవర్, 230 Nm టార్క్‌ను… 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 117 హార్స్‌పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. ఈ కొత్త మోడల్ మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో రావొచ్చు.
EV వేరియంట్ కూడా
మహీంద్రా ఇంకా ఎలాంటి వివరాలు అందించనప్పటికీ, ఈ ఎస్‌యూవీని ఐసిఇ (ICE), ఈవి (EV) వేరియంట్లలో అందిస్తారని భావిస్తున్నారు.
ALSO READ : ఎయిర్ ఇండియాతో సహా రెండు ఎయిర్ లైన్స్ లో
లాంచ్ ఎప్పుడంటే
మహీంద్రా ఈ ఎస్‌యూవీని ఆగస్టు 15న ఇండియాలో విడుదల చేయనుంది. ఆ తర్వాత అధికారిక ధరను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, భారతదేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా.