
- సీఎం సోదరులకు భూములు కేటాయించలేదు
మహాముత్తారం, వెలుగు : రాష్ట్రంలో పరిశ్రమల కోసం సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు ఎక్కడా భూమి కేటాయించలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం, మహాముత్తారం మండలాల్లో సోమవారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం సోదరులకు తక్కువ ధరలకు భూములు కేటాయించారంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపణలు అవాస్తవం అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని చెప్పారు.
అర్హులైన ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి కొత్త ఫించన్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.