
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్‌లోని అజర హాస్పిటల్‌లో బుధవారం ఏడుగురికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వంటి అత్యాధునిక వైద్య సేవల కోసం వరంగల్ ప్రజలు ఇకపై హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 150 పడకలతో ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, అవసరమైన మౌలిక వసతులు అజర హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
పలు క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతం కావడంతో సాధారణ జీవితాన్ని తిరిగి పొందే అవకాశం లభించిందని రోగులు ఆనందం వ్యక్తం చేస్తూ వైద్యులు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ ఉస్కే కిరణ్‌తో పాటు అజర హాస్పిటల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.