Reading Time: < 1 minute
Monkey Skull Found In Passengers Handbag At Delhi Airport Cisf Hands Over Passenger To Police

Delhi: ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం చెలరేగింది. ఓ ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్‌లో పుర్రె కనిపించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్‌ను ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్‌లో తనిఖీ చేస్తుండగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి అనుమానాస్పద వస్తువు కనిపించింది. దీంతో బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అందులో పుర్రె బయటపడింది.

సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రయాణికుడిని ప్రశ్నించగా, అది కోతి పుర్రె అంటూ సమాధానం ఇచ్చారు. పుర్రెను స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ కోసం సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న పుర్రెను పరీక్షల కోసం భద్రపరిచారు. ఈ ఘటనలో వన్యప్రాణులకు సంబంధించిన అంశం ఉండటంతో వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1972 నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. అసలు ఈ పుర్రె ప్రయాణికుడికి ఎలా లభించింది.? దాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎందుకు తీసుకెళ్తున్నాడు? అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.