
హైదరాబాద్, వెలుగు: గోషామహల్ఎమ్మెల్యే రాజా సింగ్తిరిగి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. గత ఏడాది జూన్‌లో పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఇప్పుడు సొంతగూటికి చేరేందుకు రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య చర్చలు సాను కూలంగా జరుగుతున్నట్టు సమాచారం. గతేడాది జూన్ 30న రాష్ట్ర అధ్యక్షుడి నియామకాన్ని నిరసిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు.
అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, హిందు త్వ అంశాలపై మాత్రం బీజేపీకి మద్దతుగానే నిలుస్తున్నారు. ఇదే టైమ్‌లో గోషామహల్ నియోజకవర్గంలోని బీజేపీ కేడర్‌లో కొంత అనిశ్చితి నెలకొన్నది. తిరిగి బీజేపీలో చేరాలని వారి నుంచి రాజాసింగ్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
ఈనేపథ్యంలో బీజేపీ ముఖ్యనేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజాసింగ్‌ను తిరిగి తీసుకుంటే హైదరాబాద్‌లో పార్టీకి బలం చేకూరుతుందని రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తోంది. ఈ క్రమంలో రాజాసింగ్‌ను పార్టీలోకి ఆహ్వానించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైందని తెలుస్తోంది.