Reading Time: < 1 minute

గడువులోగా సీఎంఆర్ అప్పగించాలి: కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

Caption of Image.

కరీంనగర్ టౌన్/శంకరపట్నం, వెలుగు: ఈ ఏడాది వానాకాలంలోని యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ ప్రక్రియను స్పీడప్ చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా రైస్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులు, రైస్ మిల్లర్లతో  కలిసి రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మిల్లులకు కేటాయించిన ధాన్యం, ఇప్పటివరకు పూర్తయిన సీఎంఆర్ డెలివరీ, తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ గోదాములకు సీఎంఆర్ తరలించే ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో నర్సింగరావు, మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రజనీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లె గ్రామాల మధ్య అండర్ పాస్ నిర్మించాలని సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు.

సిటీలో తాగునీటి సమస్య రావొద్దు
కరీంనగర్ నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ పరిధిలోని గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాగునీటి ఫిల్టర్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి లభ్యత, శుద్ధి ప్రక్రియ, సరఫరా పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, శుద్ధ నీటిని సరఫరా చేయాలన్నారు.

రిజర్వాయర్లలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉంటే రోజుకు 75 ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ నీటిని సరఫరా చేయాలన్నారు. అనంతరం ఎస్సారెస్పీకి సంబంధించిన భూములను పరిశీలించి, ఆయా ప్రభుత్వ భూములను పరిరక్షించాలన్నారు. ఆర్డీవో షర్మిల, మున్సిపల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఈఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.