
హైదరాబాద్, వెలుగు: ముంబై పర్యటనలో భాగంగా సీఎస్ సంజయ్ జాజు బుధవారం మహారాష్ట్ర సీఎస్ రాజేష్ అగర్వాల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సీఎండీ, సీఎస్ శెట్టితో వేర్వేరుగా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీఎస్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ‘రైజింగ్ తెలంగాణ–2047’ విజన్ గురించి వివరించిన ఆయన, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసుకోవడం పరస్పర సహకారంతో ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరిపారు.
అనంతరం ఎస్‌బీఐ సీఎండీ సీఎస్ శెట్టితో భేటీ అయి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, నూతన పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలు, ఉపాధి కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ‘రైజింగ్ తెలంగాణ–2047’ లక్ష్య సాధనకు బ్యాంకింగ్ రంగానికి ఉన్న ప్రాధాన్యతను ఆయన స్పష్టం చేశారు. ఎస్‌బీఐ నుంచి ఆర్థికంగా మరింత మద్దతు లభించాలని కోరారు.