Reading Time: < 1 minute

మీరు హిందువా.. నాన్ వెజ్ తింటారా : అయోధ్య మందిరం సీఈవో ఇంటర్వ్యూ ప్రశ్నలు ఇలా..

Caption of Image.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలిసారిగా పూర్తిస్థాయి సీఈఓ (CEO) పదవిని భర్తీ చేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 5,300 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, వారిలో అత్యంత ప్రతిభావంతులైన 18 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. వీరిలో మాజీ IAS, IPS, మిలిటరీ అధికారులు కూడా ఉన్నారు.

అయితే, ఈ ఇంటర్వ్యూలలో అడిగిన ప్రశ్నలు కేవలం పరిపాలన, ఆస్తుల నిర్వహణకే పరిమితం కాలేదు. అభ్యర్థుల మత విశ్వాసాలు, వ్యక్తిగత అలవాట్లను తెలిపే ఆసక్తికరమైన ప్రశ్నలను ప్యానెల్ అడిగింది.

ఇంటర్వ్యూలో అడిగిన కొన్ని కీలక ప్రశ్నలు:
1. “మీరు పక్కా హిందువులా?”, ” జట్టు పెంచుకుంటారా?”, “జంధ్యం ధరిస్తారా?”
2. “మీరు మాంసాహారం తింటారా?”, “మద్యం సేవించే అలవాటు ఉందా?”
3. శ్రీరామునిపై మీకున్న విశ్వాసం ఏమిటి ? ఆలయ మతపరమైన, సామాజిక ప్రాముఖ్యతపై మీ అవగాహన ఎంత?
4. పెద్ద పెద్ద పండగలు, ఉత్సవాల సమయంలో వచ్చే భారీ జనసమూహాన్ని ఎలా మ్యానేజ్ చేస్తారు ?

 ఎందుకు ఈ  సీఈఓ నియామకం?: 
జూన్ నెలలో ఆలయంలో నగదు, బంగారం చోరీకి గురైనట్లు వార్తలు రావడంతో, ట్రస్ట్ బోర్డు  తొలిసారి ఒక సీఈఓను నియమించాలని నిర్ణయించింది.

సీఈఓగా ఎంపికయ్యే వ్యక్తి కచ్చితంగా హిందూ సంప్రదాయాలను పాటించేవారై ఉండాలి. ఇంకా కఠినమైన శాకాహారి  అయి ఉండాలి, మద్యపాణం అలవాటు ఉండకూడదు. వయస్సు  50 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలని నిర్ణయించారు.

ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే :
 అత్యంత గోప్యంగా రామ మందిర ప్రాంగణంలోని ఒక గ్రీన్‌హౌస్‌లో మూసివేసిన తలుపుల వెనుక ఇంటర్వ్యూలు నిర్వహించారు. రిటైర్డ్ జడ్జి ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, షిర్డీ సాయిబాబా ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సురేష్ హవారేలతో కూడిన ఓ  కమిటీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించింది.

ఈ  ఇంటర్వ్యూ ప్రక్రియ మంగళవారం(11 august) ప్రారంభమైంది, మొదటి రోజు 10 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. మిగిలిన అభ్యర్థులను బుధవారం ఇంటర్వ్యూ చేయనున్నారు. 

©️ VIL Media Pvt Ltd.