Reading Time: 3 minutes
Tollywood Cost Failure Crisis High Budget Movie Losses
 ‘రాజా సాబ్’, ‘జననాయగన్’, ‘నాగబంధం’… ఇవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు పల్టీ కొట్టాయి? కథ నచ్చలేదు అన్నది ఒక రీజన్ మాత్రమే, అసలు మెయిన్ రీజన్ మరొకటి ఉంది. 100 కోట్లతో పూర్తి చేయాల్సిన సినిమాను 200 కోట్లతో ఎందుకు తీస్తున్నారు? ఏడాదిలోగా పూర్తి చేయాల్సిన సినిమాని రెండు మూడేళ్ళు తీస్తూనే ఉంటారు. రెమ్యునరేషన్ తగ్గించుకోవడం అంటే మన హీరోలకు నామోషి. హీరో క్రేజ్ కు మించి ఖర్చు పెడితే దెబ్బ తినాల్సిందేనా? ‘కాస్ట్ ఫెయిల్యూర్’ లిస్ట్ లో చేరినటువంటి కొత్త సినిమాలే… బడ్జెట్ పెరిగినా సినిమా హిట్ అయితే పెట్టుబడి వచ్చేస్తుంది, కానీ ప్రస్తుతం ఏ హై బడ్జెట్ మూవీ తీసుకున్నా ఫ్లాప్ టాక్, లేదంటే మిక్స్డ్ టాక్ మాత్రమే వస్తుంది. పెంచిన టికెట్ రేట్లతో కామన్ ఆడియన్ థియేటర్ వైపు చూడడమే మానేశాడు. లిమిటెడ్ బడ్జెట్లో తీసి, రీజనబుల్ థియేట్రికల్ రైట్స్ కమ్మితే, యావరేజ్ టాక్ వచ్చినా హిట్ అని అనిపించుకుంటాయి.
స్టార్ ఇమేజ్ కాదు కదా, యంగ్ హీరో ఇమేజ్ కూడా లేని విరాట్ కర్ణపై 100 కోట్లు పెట్టేశారు. ‘పెదకాపు’తో హీరోగా పరిచయమైన విరాట్, నభా నటాషా జంటగా నటించిన ‘నాగబంధం’లో కథ లేకుండా విఎఫ్ఎక్స్ ను నమ్ముకొని తీస్తే ఫ్లాప్ అయింది. థియేట్రికల్ రైట్స్ ను 18 కోట్లకు అమ్మితే 12 కోట్లు మాత్రమే వచ్చింది. లాస్ట్ మూవీ వంకతో ‘జననాయగన్’లో నటించడానికి విజయ్ 250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న ప్రచారం జరిగింది. దీంతో సినిమా బడ్జెట్ 400 కోట్లు దాటిపోయింది. ‘భగవంత్ కేసరి’ రీమేక్ అన్న పేరే గాని, ఒరిజినల్ వెర్షన్ లోని ఆత్మను చంపేశాడు దర్శకుడు హెచ్. వినోత్. ఈ భారీ బడ్జెట్ మూవీని 205 కోట్లకు అమ్మితే 145 కోట్లు మాత్రమే వచ్చింది. విజయ్ రెమ్యునరేషన్ పెంచడంతో ‘జననాయగన్’ కాస్ట్ ఫెయిల్యూర్ మూవీగా ఫ్లాప్ అయింది.
‘ఆదిపురుష్’, ‘రాధే శ్యామ్’ వంటి వరుస ఫ్లాపులతో గతంలో సతమతమైన ప్రభాస్, తక్కువ బడ్జెట్లో సినిమా తీయాలని ‘రాజా సాబ్’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బడ్జెట్ 150 కోట్లు అనుకుంటే 400 కోట్లకు వెళ్ళిపోయింది. దీంతో సినిమా థియేట్రికల్ రైట్స్ ను 200 కోట్లకు అమ్మడంతో 120 కోట్లు మాత్రమే వచ్చింది. 80 కోట్ల లాస్ తో కాస్ట్ ఫెయిల్యూర్ కు ఉదాహరణగా నిలిచాడు ‘రాజా సాబ్’. ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి హై బడ్జెట్ తో నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్స్ ను ముంచడం శంకర్ కు అలవాటైపోయింది. ‘గేమ్ ఛేంజర్’ ను 223 కోట్లకు అమ్మితే 109 కోట్లు కలెక్ట్ చేసింది, 114 కోట్లు నష్టాలు చూడాల్సి వచ్చింది. సినిమాను మూడేళ్ళు కాకుండా ఏడాదిలోగా తీసి, పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టకుండా ఉంటే ప్రాఫిటబుల్ మూవీ అయ్యేది.
ఆరు నెలలు, ఏడాది పాటు తీయాల్సిన సినిమాను రెండు మూడేళ్ళు తీస్తానంటే బడ్జెట్ పెరిగిపోతుంది. వడ్డీల రూపంలోనే కోట్లు కట్టాల్సిన పరిస్థితి. ‘ఆచార్య’ సినిమా కోసం నిర్మాత 50 కోట్లు వడ్డీనే కట్టాడని చిరంజీవి పేర్కొన్నాడు. నాలుగైదేళ్ళు సెట్స్ పై ఉండడం ‘హరిహర వీరమల్లు’కు మైనస్ అయింది. థియేట్రికల్ రైట్స్ ను 125 కోట్లకు అమ్మితే 68 కోట్లు మాత్రమే వచ్చింది. సినిమాను తక్కువ టైంలో, తక్కువ బడ్జెట్లో నిర్మించి 70 నుండి 80 కోట్లకు అమ్మితే భారీ నష్టాలు వచ్చేవి కావు. భారీ బడ్జెట్ అనేది తంబీలను ఇబ్బందులు పెడుతుంది. ఒకటి కాదు రెండు కాదు, చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చేతులెత్తేశాయి. ఇలాంటి చిత్రాలు ఆడియన్స్ కు తలనొప్పిగా మారడంతో నిర్మాతలు కోలుకోలేని దెబ్బ తిన్నారు. సూర్య ‘కంగువ’పై 300 కోట్లకు పైగా పెట్టిన ఖర్చు వృథా అయిపోయింది. సినిమాను 178 కోట్లకు అమ్మితే 100 కోట్లు మాత్రమే వచ్చింది. హెచ్చులు, ఆర్భాటాలకు పోయిన తమిళ ఇండస్ట్రీ కొన్నేళ్ళుగా భారీ నష్టాలు చూసింది. ‘పొన్నియిన్ సెల్వన్’ హిట్ తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ తీశాడు. రెమ్యునరేషన్ల కోసమే 150 కోట్లు పెడితే, మేకింగ్ తో కలిపి బడ్జెట్ 250 కోట్లు దాటేసింది. థియేట్రికల్ రైట్స్ ను 105 కోట్లకు అమ్మితే 48 కోట్లు మాత్రమే వచ్చింది.
భారీ బడ్జెట్ సినిమాకు శాపంగా మారిందని తెలిసినా ఎవ్వరూ తగ్గడం లేదు. బడ్జెట్లో సగం హీరో, హీరోయిన్, డైరెక్టర్ల రెమ్యునరేషన్లకే సరిపోతుంది. ముందుగా హీరో తన పారితోషకం తగ్గించుకుంటే గానీ బడ్జెట్ తగ్గదు. అది జరగనంత కాలం సినిమా ఇండస్ట్రీని బాగు చేయడం చాలా కష్టమేనా? చేయి దాటిపోతున్న బడ్జెట్లు నిర్మాతలను భయపెడుతున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న స్టార్ల సినిమాలు కొన్ని 500 కోట్లు, మరికొన్ని 1000 కోట్లు దాటేశాయి. హీరోలకు ఉన్న క్రేజ్ ను మించి ఖర్చు పెట్టేశారు. ‘వారణాసి’ని 1000 కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా తీస్తున్నారు. ‘రాకా’ కూడా 1000 కోట్లు దాటిపోయింది. ఇంత ఖర్చు పెడితే టికెట్ రేట్లు పెంచాలి. పెంచితే కామన్ ఆడియన్ పైరసీని ఆశ్రయిస్తున్నాడు. హిట్ టాక్ తెచ్చుకుంటే పర్వాలేదు, తేడా కొడితే మాత్రం నష్టాలు భారీగా ఉంటాయన్న భయం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ను వెంటాడుతోంది. ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్ మినిమం 500 కోట్లు. సెట్స్ పై ఉన్న ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ పూర్తయ్యే నాటికి బడ్జెట్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
ఓటీటీ ఉంది కదా అని రెచ్చిపోయి బడ్జెట్ పెంచుకుంటూ పోతే డిజిటల్ సంస్థలు హ్యాండ్ ఇస్తున్నాయి, గీసి గీసి బేరాలాడుతున్నాయి. ‘విశ్వంభర’ ఓటీటీ క్లియర్ కాకపోవడంతో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. చాలా సినిమాల పరిస్థితి ఇదే, సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాయి. 100 కోట్ల షేర్ లేని యంగ్ హీరోల సినిమాలు కూడా 100 కోట్ల బడ్జెట్ దాటేస్తున్నాయి. నాని ‘ప్యారడైజ్’, సాయి దుర్గ తేజ్ ‘సంబరాలు ఏటిగట్టు’, నిఖిల్ ‘స్వయంభూ’ 100 కోట్లు దాటుతుంటే ఫ్యాన్సీ రేట్ ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు రెడీగా లేవు. బడ్జెట్ తగ్గించే మార్గాలు పట్టించుకోరు. ముఖ్యంగా హీరో, దర్శకుడు రెమ్యునరేషన్ పెంచడమే గానీ తగ్గించరు. బడ్జెట్లో సగం నటీనటుల రెమ్యునరేషన్లకే వెళ్ళిపోతుంది. పారితోషకం విషయంలో వీళ్ళ మైండ్ సెట్ మారనంత కాలం బడ్జెట్ కంట్రోల్ లోకి రాదు.