
Australia vs Bangladesh, 1st Test: డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బౌలర్లు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలకు పసికూన బంగ్లాదేశ్ పేసర్లు గట్టి షాకే ఇచ్చారు. తొలి సెషన్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 61 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. వార్త రాసే సమయానికి అంటే లంచ్ బ్రేక్ వరకు ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా డార్విన్‌లోని మార్రారా క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజే ఉత్కంఠగా మారింది. సొంతగడ్డపై భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును కోలుకోలేని దెబ్బతీశారు.
హసన్ మహమూద్ దాటికి పెవిలియన్ చేరిన ఓపెనర్లు..
ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు హెడ్, వెదర్‌ఆల్డ్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. బంగ్లాదేశ్ యంగ్ పేసర్ హసన్ మహమూద్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్‌తో చెలరేగిపోయాడు. తొలుత 22 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన హసన్, ఆ వెంటనే 23 పరుగులు చేసిన జేక్ వెదర్‌ఆల్డ్‌ను వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతికి క్యాచ్ ఇచ్చేలా చేసి పెవిలియన్ బాట పట్టించాడు. దాంతో 50 పరుగుల లోపే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది.
లబుషేన్‌ను పెవిలియన్ పంపిన ఎబాదత్..
Same type of dismissals over and over again for Travis Head.
Round the wicket, angling the ball onto the stumps, angled bat and back to the pavilion. Disappointing innings of 22 (39) v Bangladesh.#AUSvsBAN #SRH #IPL2027 pic.twitter.com/HnotEGGmls
— Varun Velamakanti
(@CricVarunSRH) August 13, 2026
రెండు వికెట్లు పడిపోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ సుదీర్ఘ సమయం క్రీజులో గడిపినప్పటికీ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 20 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన లబుషేన్‌ను ఎబాదత్ హొస్సేన్ చక్కటి బంతితో నజ్ముల్ హొస్సేన్ శాంతోకు క్యాచ్ ఇచ్చేలా చేసి ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆ తర్వాత ఆల్‌రౌండర్ కేమరాన్ గ్రీన్ (13) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
క్రీజులో స్మిత్.. నిలదొక్కుకునే ప్రయత్నం..
ప్రస్తుతం ఆస్ట్రేలియా 22 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. వెటరన్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ (7 పరుగులు, 16 బంతులు) క్రీజులో ఉన్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 2 వికెట్లు, ఎబాదత్ హొస్సేన్ ఒక వికెట్ తీసి ఆసీస్‌ను డిఫెన్స్‌లో నెట్టేశారు.
తొలి సెషన్‌లోనే కీలక వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా డిఫెన్స్‌లో పడగా, బంగ్లాదేశ్ జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించింది. స్టీవ్ స్మిత్, కేమరాన్ గ్రీన్ జంట ఆసీస్‌ను ఎంతవరకు ఆదుకుంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(@CricVarunSRH)