Reading Time: < 1 minute

పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన.. మెదక్ మాజీ DCCB చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి 

Caption of Image.

ఆయనో ప్రజాప్రతినిధి..పేకాటఆడుతూ అడ్డంగా దొరికాడు.. మొదటి సారి కాదు..ఇది రెండోసారి.. గతంలో పోలీసులు హెచ్చరించినా అదే ధోరణి..అక్కడో ఇక్కడో కాదు.. ఏకంగా ఓ లగ్జరీ అపార్టుమెంట్ లో పేకాట రాయుళ్లతో కలిసి దర్జాగా పేకాట ఆడుతుండగా పక్కాసమాచారంతో పోలీసులు చేసిన రైడ్స్  చేయగా  రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు ఆ ప్రజాప్రతినిధి.. మెదక్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు.. వివరాల్లోకి వెళితే..   

రంగారెడ్డి:కొంపల్లిలో పేకాట రాయుళ్ల గుట్టు రట్టు చేశారు కుత్బుల్లాపూర్ ఎస్ వోటీ పోలీసులు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అపర్ణ సరేనేటి అపార్టుమెంట్ పై రైడ్ చేసిన పోలీసులు.. పలువురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మెదక్ మాజీ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.  దేవేందర్ రెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కడం ఇది రెండో సారి.దేవేందర్ రెడ్డి సహా మొత్తం 8మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ రైడ్స్ లో 3లక్షల 28 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు ఎస్ వోటీ పోలీసులు. 

©️ VIL Media Pvt Ltd.