
ఐదేళ్లుగా జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు పాకిస్తాన్ దేశంలో కలకలం. పాకిస్తాన్ లో ప్రముఖ జర్నలిస్ట్ సయూద్ ఖాన్ ఈ ప్రకటన చేయటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ దేశం అధికారికంగా ప్రకటించలేదు. ఇంతకీ ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నారా లేక చనిపోయారా అనే విషయంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మరణించి ఉండవచ్చని ముగ్గురు సీనియర్ సైనిక వర్గాలు తెలిపినట్లు పాకిస్తానీ జర్నలిస్ట్ వజహత్ సయీద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ వార్తను ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు, లాయర్లు, పాకిస్తాన్ తెహ్రీక్ ఎఇన్సాఫ్ (PTI) నేతలు, వ్యక్తిగత డాక్టర్లకు అనుమతి ఇవ్వడం లేదని కూడా ఆరోపణలు ఉన్నాయి.
2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అల్ ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో 14 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని PTI డిమాండ్ చేస్తోంది. ఆయనకు కుటుంబ సభ్యులు, డాక్టర్లను కలిసే అవకాశం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని పార్టీ హెచ్చరించింది. అయితే గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ ఇలాంటి పుకార్లు వచ్చాయి. తరువాత ఆయన సోదరి జైలులో కలవడంతో అవి వదంతులేనని తేలింది.
IMRAN KHAN COULD BE DEAD.
Senior Pakistani 🇵🇰 journalist Wajahat S Khan says at least three military officers have told him the jailed PM may not be alive.
Which is why there has been no public appearance for long.
Did they kill him in captivity? pic.twitter.com/4sv2a6UgXT— Abhijit Majumder (@abhijitmajumder) August 11, 2026