Reading Time: < 1 minute
No Franchise No Superhero But It Grossed A Billion Dollars

ఫ్రాంచైజీ లేదు సూపర్‌హీరో లేడు కానీ బాక్సాఫీస్ మాత్రం బిలియన్ డాలర్లకు చేరింది. క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్‌లో 1 బిలియన్ డాలర్ మార్క్‌ను దాటింది. ‘ది ఒడిస్సీ’కి బాక్సాఫీస్ రన్ మొదటి నుంచే స్ట్రాంగ్‌గా కనిపించింది. ఓపెనింగ్ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 264 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇది నోలన్ సినిమాల్లోనే హైయెస్ట్ గ్లోబల్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఇప్పుడు మూడు వారాల వ్యవధిలోనే బిలియన్ డాలర్లు దాటడంతో నోలన్ పేరు కూడా ఒక ప్రత్యేక బాక్సాఫీస్ బ్రాండ్‌గా మారిందా అనే చర్చ మొదలైంది. అయితే ఇది ‘అవెంజర్స్’ లేదా ‘అవతార్’ లాంటి ముందే ఏర్పడిన ఫ్రాంచైజీ కాదు. అయినా ఆ స్థాయిలో మార్కెట్ రావడం విశేషం.

‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్‌లో మరో కీలక అంశం IMAX. ఈ సినిమా పూర్తిగా IMAX 70mm ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరించిన ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్‌గా నిలిచింది. ఓపెనింగ్ వీకెండ్‌లోనే IMAX నుంచి సుమారు 52 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. అంటే కేవలం కథను థియేటర్‌లో చూడటం కాకుండా పెద్ద స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను కూడా సినిమా బిజినెస్‌లో భాగంగా మార్చడం ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇది ప్రతి సినిమాకు వర్క్ అయ్యే ఫార్ములా కాదు. నోలన్ పేరు, భారీ విజువల్స్, ప్రీమియం స్క్రీన్స్… ఈ మూడు కలిసి బాక్సాఫీస్‌ను నడిపించాయి. ‘ది ఒడిస్సీ’ 1 బిలియన్ డాలర్ల కలెక్షన్స్‌ దాటడం నార్మల్ విషయం కాదు. కానీ అక్కడి టాప్‌లో నిలవాలంటే మాత్రం ఇంకా భారీ నంబర్లు కావాలి. ‘అవతార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘టైటానిక్’ లాంటి సినిమాలు 2 బిలియన్‌ డాలర్లలను క్రాస్ చేశాయి. అందుకే బిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఒక రికార్డ్ అయితే ఆ క్లబ్‌లో టాప్ ప్లేస్ సాధించడం మరో గేమ్.

ఒక దర్శకుడి పేరుతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఫ్రాంచైజీ లేకుండా బిలియన్ మార్క్ దాటించడం మాత్రం ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ సిగ్నల్. ఇక ముందు స్టూడియోలు కూడా ఫ్రాంచైజీల కంటే దర్శకుడి బ్రాండ్‌పై భారీగా పెట్టుబడి పెట్టే పరిస్థితి వస్తుందా? లేక ‘ది ఒడిస్సీ’ సక్సెస్ నోలన్‌కు మాత్రమే పరిమితమవుతుందా? అనే డిస్కషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.