Reading Time: < 1 minute

సెల్‌‌‌‌‌‌‌‌బేలో రెడ్‌‌‌‌‌‌‌‌మీ నోట్ 17 5జీ లాంచ్‌‌‌‌‌‌‌‌.. ఆగస్టు 12 నుంచి అమ్మకాలు స్టార్ట్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ మల్టీ-బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ ‘సెల్ బే’, షావోమీ సంస్థతో కలిసి ‘రెడ్‌‌‌‌‌‌‌‌మీ నోట్ 17 5జీ’ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. గచ్చిబౌలిలోని సెల్ బే షోరూమ్‌‌‌‌‌‌‌‌లో ఈ ఫోన్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. టాలీవుడ్ నటి చెరుకూరి మానస చౌదరి, సెల్ బే మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు, షావోమి ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

బంపర్ ఆఫర్లు!

వినియోగదారులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్‌‌‌‌‌‌‌‌ను  అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా సెల్ బే ఎండీ సోమ నాగరాజు తెలిపారు. ఆగస్టు 12 నుంచి తమ అన్ని షోరూమ్‌‌‌‌‌‌‌‌లలో రెడ్‌‌‌‌‌‌‌‌మీ నోట్ 17 సిరీస్‌‌‌‌‌‌‌‌ అమ్మకాలు  ప్రారంభమవుతాయని వెల్లడించారు. వినియోగదారులు తమ ప్రతి   కొనుగోలుపై  ఉచితంగా 50వాట్స్‌‌‌‌‌‌‌‌ కరావొకే స్పీకర్, ఒక సంవత్సరం థెఫ్ట్ ఇన్సూరెన్స్,  సెల్ బే ప్రత్యేక జూట్ బ్యాగ్ వంటివి  పొందొచ్చన్నారు. అంతేకాకుండా సెల్‌‌‌‌‌‌‌‌బే  ఈఎంఐ  సదుపాయాన్ని అందిస్తోందని,   ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని నాగరాజు వివరించారు.

8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో..

రెడ్‌‌‌‌‌‌‌‌మీ నోట్ 17 5జీలో 8,000 ఎంఏహెచ్  సిలికాన్ -కార్బన్ బ్యాటరీ,  స్నాప్‌‌‌‌‌‌‌‌డ్రాగన్4 జెన్ 4 చిప్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8  ఎంపీ ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఏడు ఇంచుల  ట్రూ కలర్ అమోలెడ్‌‌‌‌ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే, 120 హెడ్జ్‌‌‌‌‌‌‌‌ రిఫ్రెష్ రేట్‌‌‌‌‌‌‌‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ.28 వేలు, 8జీబీ+128 జీబీ ధర రూ.31 వేలు. బ్లూ, పర్పుల్‌‌‌‌‌‌‌‌, బ్లాక్ కలర్స్‌‌‌‌‌‌‌‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. కొన్ని కార్డులపై డిస్కౌంట్లు ఉంటాయి.

©️ VIL Media Pvt Ltd.