
న్యూఢిల్లీ, వెలుగు: పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణకు అదనంగా ఐపీఎస్లను కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.బుధవారం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని ఎంపీలు మల్లు రవి, సురేష్ శెట్కార్, వంశీకృష్ణ కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పోలీసు శాఖపై పెరుగుతున్న పనిభారం దృష్ట్యా అదనపు ఐపీఎస్‌లు అవసరమని వివరించారు.