Reading Time: 2 minutes
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే శరీరం ఉక్కులా మారిపోయిద్ది.. జుట్టుకు, బ్యూటీకి న్యాచురల్ మెడిసిన్

ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా.. ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం రోజంతా ప్రభావం చూపుతుందని.. దీని విషయంలో అశ్రద్ధ వద్దని పేర్కొంటున్నారు. అయితే.. అలాంటి పోషకకరమైన బలమైన ఆహారాల్లో రాగులు ఒకటి.. పోషకాలు పుష్కలంగా ఉన్న ఫింగర్ మిల్లెట్ ఆరోగ్యాకి చాలా మంచివి. అందుకే.. తప్పనిసరిగా ఉదయాన్నే రాగి జావ తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. రాగి జావ అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు.

రాగి జావ పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు..

రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, రక్తహీనతను నివారిస్తుంది. రక్తహీనత ఉన్నవారికి రాగి జావ ఒక మంచి ఆహారం. అంతేకాకుండా, రాగి జావలో అధికంగా ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇది వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుతుంది.

రాగి జావలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అధిక ఫైబర్, తక్కువ కొవ్వు కారణంగా ఇది తొందరగా కడుపు నిండిన భావనను కలిగించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొవ్వు కరగడంలో కూడా తోడ్పడుతుంది.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన రాగి జావ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు రాగి జావ తాగితే షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. రాగి జావలోని యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో అనేక ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్న రాగి జావ ఉదయం తాగితే రోజంతా శక్తివంతంగా, ఉల్లాసంగా ఉండవచ్చు.

5 నిమిషాల్లోనే రాగి జావ..

అయితే.. రాగి జావ కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. ముందుగా కొంచెం రాగి పిండిని ముద్దలు లేకుండా నీళ్లల్లో కలుపుకోవాలి.. అనంతరం నీళ్లు వేడి చేసుకోవాలి.. వేడి అయిన నీళ్లల్లో ముద్దలు లేకుండా కలిపిన మిశ్రమాన్ని పోయాలి.. అనంతరం జావ చిక్కగా మారిన అనంతరం పోయ్యి మీద నుంచి దింపాలి. కొంచెం ఉప్పు, ఉల్లిపాయ, మిర్చి తురుము వేసుకుని తీసుకోవచ్చు.. ఇంకా కావాలంటే మజ్జిగ, నిమ్మరసం కూడా కలుపుకుని తాగవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..