
Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం కాస్తా పెద్ద గొడవగా మారిన ఘటనలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంటుంది. తాజాగా ఇద్దరు యువతుల మధ్య జరిగిన వాగ్వాదం, ఆ తర్వాత చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఒకరికొకరు ఎదురుగా నిలబడి తీవ్రంగా వాదించుకోవడం కనిపించింది. మొదట మాటలతో మొదలైన గొడవ క్రమంగా తీవ్రరూపం దాల్చింది. వారిలో ఒకరు మరో యువతిని, “ఇంతకాలంగా నాతో ఎందుకు మాట్లాడలేదు?” అని ప్రశ్నించినట్లు వీడియోలో వినిపిస్తుంది. అందుకు మరో యువతి “ఆమె నా ప్రాణ స్నేహితురాలు” అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఒకరు మరో యువతిని చెంపదెబ్బ కొట్టడంతో గొడవ శారీరక ఘర్షణగా మారింది.
ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు వరుసగా చెంపదెబ్బలు కొట్టుకుంటూ, తోసుకుంటూ కనిపించారు. అక్కడే ఉన్న మరో యువతి వారిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇంతలో మరో యువతి ఈ మొత్తం ఘటనను మొబైల్ కెమెరాలో రికార్డ్ చేస్తూ “దీపు.. ఆగు, దీపు.. ఆగు” అంటూ నవ్వుతూ చెప్పడం కూడా వీడియోలో వినిపిస్తుంది. కొద్దిసేపు ఇద్దరూ చేతులు పట్టుకుని గొడవను ఆపినట్లు కనిపించినా, వెంటనే మళ్లీ వాగ్వాదానికి దిగారు.
ఈ ఘటన ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగిందనే వివరాలు మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. వీడియోలోని సంభాషణ ఆధారంగా ఈ గొడవకు ఓ వ్యక్తి లేదా స్నేహానికి సంబంధించిన వివాదమే కారణమై ఉండొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “నేను 14 చెంపదెబ్బలు లెక్కించాను”, “14 చెంపదెబ్బలు.. పీక్ ఫైట్” అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు కెమెరాలో రికార్డ్ చేస్తున్న యువతిపై సరదాగా వ్యాఖ్యలు చేశారు. పలువురు నవ్వుతున్న ఎమోజీలతో స్పందించారు. అయితే, వ్యక్తిగత వివాదం ఏదైనా సరే శారీరక దాడికి దారితీయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(@arox_xd)