వాతావరణం మారిన వెంటనే కొందరికి జలుబు, గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ముక్కు దిబ్బడ, ఇంకా అజీర్తి వంటి సమస్యలు కూడా తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి టైం లో ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ డ్రింక్ తాగితే చాలు. వీటి కోసం ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ మూడు చాలు.
అవి మరేవో కావు బిర్యానీ ఆకు, శొంఠి, వాము వాటర్. ఈ మూడింటిని మంచి నీటిలో మరిగించి తీసుకుంటే శరీరానికి వేడిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ గొంతుకు కూడా కొంత వరకు ఉపశమనం ఉంటుంది. మరి అస్సలు లేట్ చేయకుండా వీటికి కావాల్సిన పదార్దాలు , తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఈ డ్రింక్ కు చేయడానికి కావాల్సిన పదార్థాలు : మూడు బిర్యానీ ఆకులు, అర టేబుల్ స్పూన్ శొంఠి పొడి, అర టేబుల్ స్పూన్ , అర టేబుల్ స్పూన్ వాము, రెండు గ్లాసులు నీళ్లు, అర టేబుల్ స్పూన్ తేనెను తీసుకోవాలి. వీటితో చేసి తాగితే చాలు. మీరు తాగిన వెంటనే వారికి ఉపశమనం పొందుతారు.
తయారీ విధానం : ముందుగా మీరు ఒక పెద్ద గిన్నె తీసుకుని రెండు గ్లాసులు తీసుకుని స్టవ్‌పై పెట్టి వాటిని బాగా మరిగించాలి. ఈ నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత దానిలో బిర్యానీ ఆకు, అర టేబుల్ స్పూన్ వాము, అర టీస్పూన్ శొంఠి పొడి కూడా వేసుకోవాలి. మీరు వీటిని 5 నుంచి 6 నిమిషాల పాటు స్టవ్ మీదే మరిగించాలి. ఇంకా కావాలంటే తేనె వేసి దీనిలో కలుపుకోవచ్చు.
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




