
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తుండగా ఎయిరిండియా విమానం తీవ్రమైన కుదుపులకు గురైన ఘటనలో పైలట్ ఇన్ కమాండ్‌గా వ్యవహరించిన వ్యక్తికి అధికారులు డోప్ టెస్టు చేశారు. రెండుసార్లు జరిపిన డోప్ టెస్ట్‌లో అతను గంజాయి తాగి విమానం నడిపినట్లు తేలిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 4న 137 మంది ప్యాసింజర్లు, 8 మంది సిబ్బందితో పుకెట్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం (ఏఐ-2379).. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా 300 అడుగుల ఎత్తును కోల్పోయి భారీ కుదుపులకు గురైంది.
ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన స్క్రీనింగ్‌లో కో-పైలట్ నార్మల్ అని తేలగా.. ప్రధాన పైలట్ మాత్రం గంజాయి సేవించినట్లు కన్ఫామ్ అయింది. భద్రతా నిబంధనల దృష్ట్యా ఇద్దరు పైలట్లను విధుల నుంచి తొలగించారు.