Reading Time: 1 minute

నల్లమలలో మరో పెద్దపులి మృతి.. అడవుల్లో టైగర్స్కు రక్షణ లేదా..?

Caption of Image.

నల్లమలలో మరో పెద్దపులి చనిపోయిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) లో 2025 సెప్టెంబర్ నెలలో పెద్దపులి చనిపోయినట్లు 2026 ఆగస్టు 11న ఆధారాలు   లభ్యం అవ్వడం అధికారులను టెన్షన్ కు గురిచేస్తోంది. వేటగాళ్ల ఉచ్చులో పడి పెద్దపులి చనిపోవడంతో.. అడవిలో చివరికి పెద్దపులులకు కూడా రక్షణ లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

నల్లమలలో రెండు పులుల చనిపోయిన అంశంలో అటవీ రక్షణ విషయంలో తీవ్ర ఆందోళన నెలకొన్న సందర్భంలో మరో ఆడపులి చనిపోయినట్లు లేటెస్టుగా వచ్చిన రిపోర్టుతో ఒక్కసారిగా ఫారెస్టు అధికారులు అలర్టయ్యారు. అయితే ఈ రెండు పులలలో ఒకటి వేటగాళ్ల ఉచ్చులో చనిపోవడం.. దాని పంజాలను తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. 

ఆత్మకూర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనపై అటవీ సంరక్షణ విషయంలో కొత్త ప్రశ్నలు లేవనెత్తునున్నాయి. ఆత్మకూర్ డివిజన్ లోని నాగలూటి రేంజ్ లో ఇందిరేశ్వర్ సెక్షన్ లో వేటగాళ్లు పన్నిన ఉచ్చులో పడి పులి చనిపోయింది. ఇది చిన్న జంతువుల కోసం వేసిన వలనా లేక పులుల కోసమే పన్నారా అనే అనుమానాలతో విచారణ చేస్తున్నారు. పులి పంజా, గోళ్లు తీసుకెళ్లడం చూస్తుంటే పులుల కోసం పన్నిన వలగానే భావిస్తున్నారు. 

ఈ ఘటన 2025లో జరిగినప్పటికీ.. కింది స్థాయి ఫారెస్ట్ అధికారులు పై అధికారుల వరకు సమాచారం చేరకుండా దాచారు. స్థానికులతో కలిసి పులి కళేబరాన్ని పూడ్చిపెట్టినట్లు రిపోర్టులో తేలింది. ఈ పులి 2025లో కొత్త చెరువు ఏరియాలో చనిపోయినట్లు NSTR డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావు నిర్ధారించారు. 

అంతర్జాతీయ పులల దినోత్సవం జులై 29న వేటగాళ్ల వలలో పడి పులి చనిపోయింది. వేటగాళ్లు దాని పంజాను, గోళ్లను తీసుకెళ్లి చివరికి అధికారులకు పట్టుబడ్డారు. అదే విధంగా మరో పులి జులై 31న చనిపోయింది. వేటాడుతున్న సమయంలో ముళ్లపంది శరీరం ముళ్లు కుచ్చుకుని రెండో పులి చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. 

ఈ పులికి సంబంధించిన గోళ్లను కూడా వేటగాళ్లు కత్తిరించుకువెళ్లారు. ఒకే వారంలో రెండు పులులు చనిపోవడం.. అప్పట్లో ఆందోళన కలిగించింది. అయితే వారం తర్వాత ఏడు మంది వేటగాళ్లను ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.