Reading Time: < 1 minute

మాతృ భాష రాదా.. అయితే లైసెన్స్ క్యాన్సిల్.. డ్రైవర్లకు భాష తప్పనిసరి చేసిన ప్రభుత్వం

Caption of Image.

ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ట్యాక్సీ డ్రైవర్లు, కమర్షియల్ ట్రాన్ పోర్ట్ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరిగా రావాల్సిందేనని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అందులో భాగంగా 2026 ఆగస్టు 12న మహారాష్ట్ర మోటర్ వెహికిల్స్ (సవరణ) రూల్స్,2026 ను సవరించింది. 

ఈ సవరణ ప్రకారం.. డ్రైవర్లకు మరాఠీ రాకపోతే ఫైన్ విధించండం, మూడు నెలల వరకు లైసెన్స్ సస్పెండ్  చేయడం.. నిబంధనలు అతిక్రమించినా, పునరావృతం అయితే లైసెన్స్ రద్దు చేసే అధికారాన్ని ట్రాన్స్ పోర్ట్ అధికారులకు కల్పిస్తూ చట్టసవరణ చేసింది. 

ప్యాసెంజర్ కమర్షియల్ వెహికిల్స్, ఆటోలు, క్యాబ్స్ (కార్లు), ట్యాక్సీలు, యాప్ ఆధారంగా నడిచే క్యాబ్స్ మొదలైన వాహనాలు నడిపే డ్రైవర్లకు తప్పినిసరిగా మరాఠీ రావాల్సిందేనని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. 

అత్యంత ముఖ్యమైన మార్పు అమలులో ఉంది. కొత్తగా చేర్చిన నియమం 22(3A) ప్రకారం, యాప్ ఆధారిత మోటార్ క్యాబ్‌ల డ్రైవర్లు మరాఠీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ డ్రైవర్‌కు మరాఠీ పరిజ్ఞానం సరిగా లేదని తేలితే, లైసెన్సింగ్ అథారిటీ కారణాలను రాతపూర్వకంగా నమోదు చేసిన తర్వాత చర్యలు తీసుకోవచ్చు. 

ఇప్పటి వరకు ఉన్న  నిబంధనలలోని స్పష్టత లేకపోవడంతో  కొంతమంది డ్రైవర్లు భాషా నిబంధనను పాటించకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ అస్పష్టతలను తొలగించడానికే ఈ సవరణలు చేసినట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.