Reading Time: < 1 minute

మంచిర్యాల&పెద్దపల్లి జిల్లాలో 200 మీటర్ల త్రివర్ణ పతాక ర్యాలీ

Caption of Image.

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మండల బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టూడెంట్లతో కలిసి 200 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో పట్టణ వీధుల గుండా ర్యాలీ తీశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, లీడర్లు సురేశ్ రెడ్డి, అర్జున్ రావు, శ్రీనివాస్, మహేందర్, అన్వేశ్, కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికవాడల్లో బైక్​ ర్యాలీ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్​ తిరంగా అభియాన్​ను నిర్వహించారు. సింగరేణి కార్మికవాడల్లో జాతీయ జెండాలతో బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 14 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.వెంకటకృష్ణ, అక్కల రమేశ్, టౌన్, మండల​ ప్రెసిడెంట్లు​సప్పిడి నరేశ్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.