Reading Time: 2 minutes

మీకు తెలుసా : ఈ శ్లోకాలకు అర్థం తెలుసుకుంటే.. మీరు రోజూ చదువుతారు.. అంత పవర్ ఫుల్

Caption of Image.

గుడికి వెళ్లినప్పుడో.. లేకపోతే ప్రవచనాలు వింటున్నప్పుడో మనకు కొన్ని శ్లోకాలు, మంత్రాలు వినిపిస్తుంటాయి. అలా చాలా సార్లు వినడం వల్ల అవన్నీ మనకు తెలిసినవే అని కూడా అనిపిస్తుంటుంది. కొంతమంది తెలియకుండానే, వాటిని కంఠస్థం చేసేస్తారు. కానీ, సంస్కృతంలో ఉండే వాటి భావం ఏంటో చాలామందికి తెలియదు. అవేంటో చూద్దాం..!

ఓం అసతోమా సద్గమయ,
 తమసోమా జ్యోతిర్గమయ,
 మృత్యోర్మా అమృతంగమయ

భావం: ఓం… అసత్యం నుంచి సత్యానికి తీసుకోబడుదుము గాక! చీకటి నుంచి వెలుగుకి, మృత్యువు నుంచి అమృతత్వానికి ప్రయాణించుదుము గాక!

ఓం సహనావవతు సహనౌభునక్తు,
 సహవీర్యం కరవావహై,
 తేజస్వినావధీత మస్తు, మావిద్విషావహై
 ఓం.. శాంతి.. శాంతి.. శాంతిః…

భావం: ఆ పరమాత్మమన (గురు శిష్యులు) ఇద్దరిని రక్షించుగాక! సమర స్ఫూర్తితో పని చేద్దుము గాక! మన ఇద్దరం కలిసి చేసే అధ్యాయనం ఫలవంతమగు గాక! ఎన్నడూ మనమిద్దరమూ ద్వేషించు కోకుండా ఉందుము గాక!

ఓం సర్వేభవస్తు సుఖిన! 
సర్వేసస్తు నిరామయా! 
సర్వేభద్రాద్రి పశ్యంతు 
మాకశ్చిదుఃఖ భాగ్యవేత్!!

భావం: అందరూ సర్వ సుఖాలు పొందుదురు గాక! సాధుజనులు అందరూ ఆరోగ్యవంతులు అగుదురు గాక! అందరూ సర్వ శుభాలను చూద్దురుగాక! ఏ ఒక్కరూ దుఃఖితులుకారుగాక!

ఓం సర్వేశాం స్వస్థిర్భవతు స్వస్తిర్భవతు!
సర్వేశాం శాంతిర్భవతు!
 సర్వేశం పూర్ణం భవతు! 
సర్వేజనా సుఖినో భవంతు!!
 సమస్త సన్మంగళాని భవంతు

భావం: అందరిలో  శుభప్రదమైన భావనలు ఉండుగాక! అందరిలో శాంతి విలసిల్లును గాక! అందరిలో ఉన్న కోరికలన్నీ తీరి నిండు హృదయం ఉండును గాక! సర్వజనులందరూ సుఖవంతులవుదురుగాక! సమస్తం కళ్యాణకరమగు భావనలు నెలకొని ఉండుగాక!

గాయత్రి మంత్రం

ఓం భూర్భువం: స్వః! 
తత్సవితుర్వ రేణ్యం!
 భర్గోదేవస్యధీమహి! 
ధియోయోన: ప్రచోదయాత్!!

భావం: ఆ ప్రాణ స్వరూపం, దుఃఖనాశక, సుఖస్వరూపం, శ్రేష్టము, తేజస్సు గల. పాపనాశకం, దేవ స్వరూపమైన పరమాత్మను అంతరాత్మను ధరించెదము గాక! ఆ పరమాత్మ
మా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక! 

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః ! 
బ్రహ్మాగ్నౌ బ్రహ్మాణాహుతమ్!
 బ్రహ్మైవ తేన గన్తవ్యం!
 బ్రహ్మ కర్మ సమాధినా!

భావం: సర్వమూ బ్రహ్మమే, హోమం బ్రహ్మమే. అగ్నీ బ్రహ్మమే! పొందతగినది బ్రహ్మమే, చేరవలసినది బ్రహ్మమునే కాబట్టి, చేసే పనులన్నింటినీ బ్రహ్మ భావనతో చేయాలి.

అన్నపూర్ణే సదాపూర్ణే!
 శంకర ప్రాణ వల్లభే!
 జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం!
 భిక్షాందేహీ చ పార్వతీ!!

భావం: ఎల్లవేళలా పూర్ణమయ స్వరూపిణివైన అన్నపూర్ణా! శంకరుని ప్రియపత్నీ! ఓ పార్వతీ.. జ్ఞాన, వైరాగ్యాలు కలగడానికై నిన్ను భిక్షను ఆర్థిస్తున్నాను తల్లీ!
 

©️ VIL Media Pvt Ltd.