Reading Time: < 1 minute

షార్ట్ కట్ మీ జీవితాన్ని కట్ చేస్తుంది..! రీల్స్, ఇన్ ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు..! Gen Z కి మోడీ మెసేజ్..!

Caption of Image.

రీల్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దని జెన్ జీ కి పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. సక్సెస్ కోసం షార్ట్ కట్స్ వెతికితే..జీవితం దెబ్బతింటుందని అన్నాడు మోడీ. బుధవారం ( ఆగస్టు 12 ) ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆత్మకథ ” ట్రయంఫ్ అఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

రైల్వేస్టేషన్స్ లో కనిపించే వార్నింగ్ బోర్డ్స్ ని ఉదహరిస్తూ… జెన్ జీకి మెసేజ్ ఇచ్చారు మోడీ. చాలామంది ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వాడకుండా సమయం ఆదా అవుతుందని.. రైలు పట్టాలు దాటుతుంటారని.. అలాంటి చోట్ల షార్ట్ కట్ విల్ కట్ యు షార్ట్ అని ఒక హెచ్చరిక రాసి ఉంటుందని… నేటి యువత కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు మోడీ.

►ALSO READ | మీ లెక్చర్లు వినే ఇంట్రెస్ట్ లేదు.. అమిత్ షా రిజైన్ చేయాల్సిందే: రాహుల్ గాంధీ

అంతే కాకుండా రకరకాలుగా డైవర్ట్ చేసే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు మోడీ. యువత ముందుకు సాగడానికి వారి రోల్ మోడల్స్ ఆత్మకథలు తప్పక చదవాలని సూచించారు మోడీ.
 

©️ VIL Media Pvt Ltd.