Reading Time: 2 minutes
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ తీరప్రాంతం, బంగ్లాదేశ్ ని ఆనుకోని ఉన్న ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదిలి, ఈ రోజు, 13 ఆగస్టు, 2026, ఉదయం 0830 గంటలకు (భారత కాలమానము ప్రకారము ) వాయుగుండంగా కేంద్రీకృతమై, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతంపై 22.3° ఉత్తర అక్షాంశం, 88.6° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది కానింగ్ (పశ్చిమ బెంగాల్)కు వాయువ్యంగా, కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)కు ఆగ్నేయంగా సుమారు 40 కి.మీ., మేదినీపూర్ (పశ్చిమ బెంగాల్)కు తూర్పున 130 కి.మీ., బారిపడ (ఒడిశా)కు తూర్పు-ఈశాన్యంగా 190 కి.మీ., జంషెడ్‌పూర్ (జార్ఖండ్)కు తూర్పు-ఆగ్నేయంగా 260 కి.మీ. దూరంలో ఉంది.
ఇది రాబోయే 24 గంటల్లో గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్ – జార్ఖండ్ మీదుగా దాదాపు వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.

సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు ఫిరోజ్‌పూర్, ముజఫర్ నగర్, బారాబంకి, దేహ్రి, తీరప్రాంత పశ్చిమ బెంగాల్ తీరప్రాంతము మరియు బంగ్లాదేశ్‌లోని ఆనుకొని ఉన్న ప్రాంతాలు & వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న వాయుగుండం కేంద్రం గుండా ప్రయాణిస్తూ, సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే.. మధ్య – దానిని ఆనుకొని ఉన్న ఉత్తర భారతదేశ ద్వీపకల్పము, సుమారుగా 22° ఉత్తర అక్షాంశం వెంబడి, ఉన్న నిన్నటి షియర్ జోన్ సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కి.మీ. ఎత్తులో, ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం వైపుకు వంగి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం;-

గురువారం ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ;-

గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

తెలంగాణలో కూడా వర్షాలు..

అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. గురువారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల రెండు రోజులలో క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కి.మీ వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..