
- ఏఎస్డీ కింద 24,460 ఓట్లు.. ‘సర్’ డిజిటైజేషన్ 90.6 శాతం
యాదాద్రి, వెలుగు : ఉమ్మడి నల్గొండలో 2,81,558 ఓట్లు లేనట్టేనని తెలుస్తోంది. 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను మ్యాపింగ్చేశారు. 2025 ఓటరు జాబితా ప్రకారం ఉమ్మడి నల్గొండలోని మూడు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 29,84,448 మంది ఓటర్లున్నారు.
యాదాద్రి జిల్లాలో 94.32 శాతం ఫారాలు డిజిటైజేషన్ చేశారు. ఓవరాల్‌గా ఉమ్మడి జిల్లాలో 90.6 శాతం ఫారాలను డిజిటలైజేషన్ చేశామని ఎన్నికల సంఘం లెక్కలు విడుదల చేసింది.
2 లక్షల 81వేల 558 ఓట్లు లేనట్టే
ఓటర్లకు అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకోవడంలో కొందరు బీఎల్ఓల నిర్లక్ష్యం కారణంగా పూర్తి స్థాయిలో చేరలేదు. 24,460 ఓటర్లను ఆబ్సెంట్, షిప్టెడ్, డెత్ (ఏఎస్డీ) కేటగిరి కింద పరిగణించిన ఎన్నికల కమిషన్ వాటిని తొలగిస్తుంది. ఎన్యూమరేటర్ల వద్దకు 2,56,598 ఫారాలు రాలేదు.
దీంతో మొత్తం 2,81,558 ఓట్లు ఈ నెల 17న ఎన్నికల సంఘం రిలీజ్ చేసే డ్రాప్ట్ ఓటర్ లిస్ట్‌లో ఉండవు. వచ్చే నెల 15 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 15 వరకూ వాటిని పరిశీలించి అదే నెల 19న ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లాల వారీగా ఫారాల వివరాలు
జిల్లా ఓటర్లు డిజిటలైజేషన్ ఏఎస్డీ రాని ఫారాలు
- యాదాద్రి 4,59,943 4,33,824 3,440 22,679
- నల్గొండ 15,16,253 13,57,618 11,702 1,46,933
- నూర్యాపేట 10,08,252 9,11,948 9,318 86,986
- మొత్తం 29,84,448 27,03,390 24,460 2,56,598
వనపర్తి జిల్లాలో సర్ 86 శాతమే
వనపర్తి : వనపర్తి జిల్లాలో పూర్తి స్థాయిలో ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గమున్నా ఓటర్ల ఎన్యుమరేషన్ నూరు శాతం పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. వనపర్తి సెగ్మెంటులో మొత్తం 2,75,570 ఓటర్లుండగా ఎన్యుమరేషన్ పూర్తయ్యింది మాత్రం 2,36,978 మందివే. మొత్తం 86 శాతం మాత్రమే చేయగలిగారు. వనపర్తి పట్టణంలో 72.76, పెబ్బేరు పట్టణంలో 84.60శాతం పూర్తయ్యింది.
గద్వాల జిల్లాలో 87.31 శాతం
గద్వాల : ‘సర్’ డిజిటైజేషన్లో ఉమ్మడి జిల్లాలో జోగులాంబ గద్వాల జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. జిల్లాలో 63,925 ఆన్ కరెక్ట్ బుల్ ఫార్మ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల17న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. 17నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ముసాయిదా ఓటర్ జాబితా పై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జిల్లాల వారీగా ఫారాల వివరాలు
జిల్లా ఓటర్లు డిజిటలైజేషన్ ఏఎస్డీ రాని ఫారాలు
- మహబూబ్‌నగర్ 7,32,488 6,29,402 5502 97,584
- నాగర్‌కర్నూలు 7,31,632 6,18,594 5844 1,07,194
- వనపర్తి 2,75,570 2,37,006 1,612 36,952
- గద్వాల 5,03,859 4,39,934 3,748 60,177
- నారాయణపేట 4,95,574 4,19,214 9,109 67,251