Reading Time: 3 minutes

జాబ్ మార్కెట్ ఇంత ఘోరంగా ఉందా..? 4.5 ఏండ్ల అనుభవం.. రూ.26 లక్షల జీతం ఉన్న టెకీ పరిస్థితే ఇలా ఉంటే..

Caption of Image.

నాలుగున్నర ఏండ్ల అనుభవం.. సంవత్సరానికి జీతం 26 లక్షల రూపాయలు (₹26 LPA CTC) అంటే.. దాదాపు ఆ క్యాండిడేట్ వర్త్ ఫుల్ అయ్యే ఉంటాడు కదా. కానీ లే ఆఫ్ కారణంగా ఈ హైదరాబాదీ టెకీ పరిస్థితి ఎలా ఉందో చూస్తే.. ప్రస్తుత జాబ్ మార్కెట్ ఇంత ఘోరంగా ఉందా అనుకోక తప్పదు. 

2026 జూన్ లో జాబ్ కోల్పోయిన ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. అప్పటి నుంచి 45 రోజులుగా జాబ్ సర్చింగ్ లోనే ఉండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాకపోవడం చూస్తే టెక్ ఇండస్ట్రీ కరెంట్ సిచువేషన్ ఏంటే అర్థం అవుతుంది. 

రెడిట్ పోస్ట్ ప్రకారం.. ఈ టెకీ అమెజాన్ క్లైంట్ బేస్డ్ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఇతని పేరోల్ పేరెంట్ కంపెనీ మేనేజ్ చేస్తుండేది. అయితే లేఆఫ్ అనేది మొదట్లో అంత ప్రాబ్లమ్ కాదులే అనుకున్నానని అతడు చెబుతున్నాడు. ఆఫీసులో ఉన్న దారుణమైన వాతావరణం నుంచి ఇది రిలీఫే లే అనుకున్నాడట. పేరెంట్ కంపెనీ ఉద్యోగుల విషయంలో దారుణంగా ఉండటంతో.. తనకు రిలీవ్ దొరికింది అనుకున్నట్లు పోస్ట్ చేశాడు. 

రూ.26 లక్షల LPA, CTC  అంటే పెద్ద ఇబ్బంది కాదు కదా అనుకున్నాడట. ఎందుకంటే అతడు ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీల కోసం ట్రై చేస్తున్నాడంట. బేసికల్ గా అది కాస్త ఎక్కువే అయినప్పటికీ.. నాలుగున్నర సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తికి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇచ్చే జీతంలో పెద్ద ఎక్కువేం కాదులే అనుకున్నట్లు పేర్కొన్నారు. 

తన అనుభవం దృష్ట్యా.. జాబ్ రావడం పెద్ద విషయం కాదని అనుకున్న అతడికి మార్కెట్ మెల్ల మెల్లగా షాక్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. రోజులు గడుస్తుండగా.. తనవి పగటి కలలే అనే విషయం జులైలో బోధపడినట్లు చెబుతున్నాడు.  ఎంతో మందిని సంప్రదించినా.. ఎన్నో కంపెనీలకు రెజ్యూమ్ అప్డేట్ చేసినా.. ఒక్క రిక్రూటర్ నుంచి కాల్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించినట్లు పేర్కొన్నాడు. 

ఇప్పటికి తను లే ఆఫ్ అయ్యి 45 రోజులు అయిందని.. తన అప్లికేషన్లు అన్ని డైరెక్టుగా బ్లాక్ హోల్ కు వెళ్తున్నట్లుంది.. రెఫరెల్స్ ద్వారా అప్లై చేసినా అదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

తన రెజ్యూమ్ ATS స్కోర్ 90 కి పైగా ఉందని.. అయినప్పటికీ 90కి పైగా రెజ్యూమ్స్ పంపితే ఒక్కటంటే ఒక్క రిప్లై కూడా రాకపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నాడు. 

చివరికి తన పోస్ట్ లో ఏం పేర్కొన్నాడంటే.. ఎవరైనా హైర్ చేసుకుంటుంటే.. ఒక కామెంట్ చేయండి.. నేను డైరెక్ట్ మెసేజ్ చేస్తా. అదే విధంగా ఏదైనా సలహా, ఫీడ్ బ్యాక్, లేదంటే అప్లికేషన్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే చెప్పగలరు అంటూ రెడిట్ లో పోస్ట్ చేశాడు. 

సోషల్ మీడియా రియాక్షన్స్:

హైదరాబాద్ టెకీ రెడిట్ పోస్ట్ డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి. టాప్ ఇంటరాక్షన్స్ చూద్దాం..

ఒక యూజర్ ఇలా రిప్లై ఇచ్చాడు. నాదొక సూచన, నౌక్రీలో వేరే ఇమెయిల్ ఐడి, ఫోన్ నంబర్‌తో కొత్త ప్రొఫైల్ సృష్టించుకోండి. ఇది పర్సనల్ ఎక్స్పీరియెన్స్.. బాగా పనిచేస్తుంది. అలాగే, నౌక్రీలో ప్రస్తుత లేదా ఆశించిన CTCని పెట్టవద్దు. మీరు రిక్రూటర్‌తో మాట్లాడి, శాలరీ సీక్వెన్స్ ఎలా ఉందో తెలుసుకుని, ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. నౌక్రీ ఆప్టిమైజేషన్‌కు సంబంధించిన కొన్ని యూట్యూబ్ వీడియోలను చూడండి, అవి ఖచ్చితంగా సహాయపడతాయి, అని ఒక యూజర్ అన్నారు.

మరో రెడ్డిటర్ తన ఉద్యోగం కోల్పోయిన అనుభవాన్ని పంచుకుంటూ.. ఆ ఇంజనీర్‌ను ఓపికగా ఉండమని కోరారు.  అవును, ఇది చాలా కఠినమైన మార్కెట్. లాస్ట్ ఇయర్ నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. మొదట్లో కొన్ని ఇంటర్వ్యూలు అయ్యాక చాలా కష్టంగా ఉంటుంది. ధైర్యంగా ఉండు. అప్లై చేస్తూ ప్రయత్నిస్తూనే ఉండు అని సజెస్ట్ చేసింది. అదే సమయంలో  జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నించు, లేకపోతే చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్, అని మరొకరు అన్నారు. 

ఇంతలో, కొంతమంది యూజర్లు ఉద్యోగాన్వేషణ సమయంలో జీతం అంచనాల విషయంలో మరింత సింపుల్ గా ఉండాలని సూచించారు.  ఇదొక సూచన మాత్రమే, అర్జెంటుగా  ఉద్యోగం కావాలంటే ప్రయత్నించండి.

మార్కెట్ ఇంకా సవాలుగానే ఉందని ఎత్తి చూపుతూ, మరో యూజర్ ఆ ఇంజనీర్ శాలరీ, అనుభవం గురించి ప్రశ్నించారు. బ్రో, దాదాపు 5 ఏళ్లలో ఒక సపోర్ట్ రోల్‌కి సంవత్సరానికి 26 లక్షలు అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఇలాగే కష్టపడుతూ ఉండు, ప్రస్తుతం మార్కెట్ అంత సులభం కాదు, అని నాల్గవ యూజర్ అన్నారు. అప్లికేషన్లు, రెజ్యూమెలను స్వీకరించే విధానాన్ని మార్చాలని, ముఖ్యంగా ప్రతి ఉద్యోగానికి  అనుగుణంగా రెజ్యూమెలను రూపొందించాలని ఒక రెడిటర్ సూచించారు.

భాయ్, బహుశా మీరు జాబ్ డిస్క్రిప్షన్స్ (JDs) ప్రకారం ప్రత్యేకంగా తయారు చేసిన రెజ్యూమెలను ఉపయోగించకపోవడం వల్ల కావచ్చు, మీకు కొన్ని స్కిల్స్ తెలియకపోయినా సరే, వాటిని చేర్చండి. ఈ విధంగా మీ రెజ్యూమె షార్ట్‌లిస్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ లోపు ఆ స్కిల్ ను నేర్చుకోవచ్చు అని మరో యూజర్ రాసుకొచ్చాడు. 

©️ VIL Media Pvt Ltd.