
ఖాట్మండు: నేపాల్ వన్డే జట్టు కెప్టెన్‌గా స్టార్ లెగ్ స్పిన్నర్, మాజీ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ సందీప్ లామిచానే నియమితుడయ్యాడు. ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్–2026లో రోహిత్ పౌడెల్ స్థానంలో 26 ఏళ్ల లామిచానే జట్టును నడిపించనున్నాడు. మలేషియాలో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 వరకు టోర్నీ జరగనుంది.
గతంలో 14 వన్డేల్లో నేపాల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన లామిచానే.. ఆ జట్టు తరఫున అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. నేపాల్ ఆగస్టు 31న బహ్రెయిన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 3న మలేషియా, 6న సౌదీ అరేబియా, 8న హాంకాంగ్‌తో తలపడుతుంది.