
గూగుల్ యూజర్ల కు బిగ్ షాక్.. గూగుల్ యూజర్లకు ఎంతో కాలంగా వాయిస్ అసిస్టెంట్ సేవలందించిన గూగుల్ అసిస్టెంట్ అప్లికేషన్ ఇకపై కనిపించదు. ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, వేర్ ఓఎస్ వాచ్ నుంచి Google assistant సేవలను సెప్టెంబర్4 నుంచి నిలిపివేయనున్నారు. ఈ అప్లికేషన్ స్థానంలో Google Gemini మెయిన్ వాయిస్ అసిస్టెంట్ గా పనిచేయనుంది. ఈ విషయంలో ఇప్పటికే యూజర్లకు నోటిఫికేషన్లు పంపడం ప్రారంభించింది. అయితే ఇప్పటికే జెమిని ఏఐ వినియోగిస్తున్న యూజర్లకు పెద్ద తేడా కనిపించదు.
గూగుల్ అసిస్టెంట్.. వాయిస్ కమాండ్‌ల ద్వారా పనిచేసే ఒక వర్చువల్ అసిస్టెంట్. ఇది ఫోన్ కాల్స్ చేయడం, మెసేజ్‌లు పంపడం, రిమైండర్‌లు సెట్ చేయడం, వాతావరణ సమాచారం తెలుసుకోవడం, అలారమ్‌లు పెట్టడం ,స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడానికి ప్రధానంగాదీనిని వినియోగిస్తారు. హే గూగుల్ అని చెప్పి ఎవరికైనా కాల్స్ చేయవచ్చు, వాట్సాప్ లేదా టెక్స్ట్ మెసేజ్‌లు పంపవచ్చు.యూట్యూబ్ మ్యూజిక్ లేదా ఇతర యాప్‌లలో మీకు నచ్చిన పాటలు, పాడ్‌కాస్ట్‌లు ప్లే చేయమని అడగవచ్చు.ఇంటిలోని స్మార్ట్ లైట్లు, ఫ్యాన్లు ,ఇతర కనెక్ట్ చేసిన పరికరాలను వాయిస్‌తో ఆన్/ఆఫ్ చేయవచ్చు.
గూగుల్ అసిస్టెంట్ పూర్తిగా తొలగించి దాని స్తానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెమిని రాబోతోంది. త్వరలో చాలా మొబైల్ డివైజ్ లలో జెమినిపై పనిచేయనున్నాయి. 2016 నుంచి ఆండ్రాయిడ్ వినియోగదారులకు సేవలందిస్తున్న గూగుల్ అసిస్టెంట్ స్థానంలో మెరుగైన సేవలందించే క్రమంలో జెమిని ఏఐని కంపెనీ తీసుకువస్తోంది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో జెమిని ఏఐ మరింత మెరుగైన సేవలను అందించనుంది.
సెప్టెంబర్4 తేదీనుంచి క్రమంలో గూగుల్ అసిస్టెంట్ ఆండ్రాయిడ్ మొబైల్ లో పనిచేయకుండా పోనుంది. అయిలే ఆండ్రాయిడ్ టీవీలు సెట్ అప్ బాక్సులు, వాహనాలలో ఇంటర్నల్ గూగుల్ అసిస్టెంట్ యథావిధిగానే పనిచేస్తుంది.