Reading Time: 2 minutes

ఆగస్టు 12న ఆకాశంలో అద్భుతం.. వందేళ్లకు ఒకసారి జరిగే వింత.. చూసిన వాళ్లు అదృష్టవంతులు

Caption of Image.

వందేళ్లకు ఒకసారి  వచ్చే వింతలు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి.. కానీ ఇది అన్ని వింతల్లా సాధారణమైనది కాదు. ఒకే రోజు.. 24 గంటల్లో వరుసగా..ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ఖగోళ వింతలు 2026 ఆగస్టు 12న చోటు చేసుకుంటుండటం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిరేపుతోంది. వందేళ్లలోనే అత్యంత గొప్ప స్టార్ గేజింగ్ రోజు.. అన్ని పనులు మానేసి చూడాల్సిన రోజు అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఆగస్టు 12న  సూర్యోదయానికి ముందే.. తూర్పు దిశగా అరుదైన గ్రహాల పరేడ్ కనిపిస్తుంది. ఆరు గ్రహాలు ఉదయం ఆకాశంలో ఒకే వరుసలో కనిపిస్తాయి.  గ్రహాల్లో అంగారకుడు (మార్స్), శని కంటికి కనిపించేంత ప్రకాశవంతంగా ఉండనున్నాయి. అదేసమయంలో బుధుడు, బృహస్పతి క్షితిజ సమాంతరానికి (దిగంతం) దగ్గరగా ఉంటాయి. యురేనస్, నెప్ట్యూన్‌ను దూరదర్శిని లేదా టెలిస్కోప్ సాయంతో చూడవచ్చు.

ఆగస్టు 12న జరిగే అద్భుతాల్లో ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రోజు సాగుతున్న కొద్దీ మెయిన్ ఈవెంట్ – సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. చంద్రుడు సూర్యుడి ముందు సరిగ్గా కవర్ చేస్తూ పగటిని ఒక్కసారిగా చీకటిగా మారుస్తాడు. ఐరోపా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. ఉత్తర అమెరికా కొన్ని భాగాలు, ఐరోపా మరికొన్ని ప్రాంతాల్లో పూర్తి సూర్యగ్రహణం కనిపిస్తుంది. సూర్యుడి మీద చంద్రుడు ఒక మెరుస్తున్న కాటు వేసినట్లు కనిపిస్తుంది.

ఇక అందరికీ ఆసక్తి కలిగించే మరో అద్భుతం..  గ్రహణం తర్వాత కొన్ని గంటల్లోనే పెర్సీడ్ ఉల్కావర్షం (తోక చుక్కలు) పీక్స్ కు  చేరుకుంటుంది. వందలాది షూటింగ్ స్టార్స్ ఆకాశాన్ని వెలిగిస్తాయి. కొత్త చంద్రుడు ఉండటం వల్ల చంద్రకాంతి ఏమాత్రం అంతరాయం కలిగించదు. పూర్తి చీకటిలో ఆకాశంలో గంటకు 100 వరకు షూటింగ్ స్టార్స్ (తోకచుక్కలు) రాలుతుండటం చూడవచ్చు. ఇలాంటి అద్భుతం2045 వరకు మళ్లీ జరగే అవకాశం లేదు.

అంతేకాదు… అదే  రాత్రి మన గెలాక్సీ అయిన పాలపుంత అత్యంత ప్రకాశవంతంగా  ఆకాశంలో ఎత్తుకు ఎగసినట్లు కనిపిస్తుంది. బిలియన్ల కొద్దీ నక్షత్రాలతో నిండిన ఆ అద్భుత దృశ్యం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంనటంలో ఆశ్చర్యం లేదు. 

గ్రహ పరేడ్, సూర్యగ్రహణం, పాలపుంత, ఉల్కావర్షం – ఇవన్నీ ఒకే రోజు.. 24 గంటల వ్యవధిలో ఏర్పడటం ఆకాశలంలో అద్భుతంగా చెబుతున్నారు. ఇలాంటి అపూర్వ సంఘటన దశాబ్దాల్లో ఒకసారి మాత్రమే జరుగుతుందని అంటున్నారు. కాబట్టి ఆగస్టు 12న ఆకాశం వైపు చూడటం మర్చిపోకండి. ఇది జీవితకాలంలో ఒకసారి మాత్రమే కనిపించే దృశ్యం!

©️ VIL Media Pvt Ltd.