Reading Time: < 1 minute
India Rejects China Arunachal Pradesh Naming Claims 27 Places

Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలకు భారత్ అధికారికంగా ఇటీవల పేర్లు ప్రకటించింది. అయితే, దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చైనా వాదనల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం. ఇది స్వయంస్పష్టమైన వాస్తవం. ఈ వాస్తవాన్ని ఏదీ మార్చలేదు” అని పేర్కొన్నారు.

ఇటీవల భారత్ అరుణాచల్‌లోని 27 ఊర్లు, భౌగోళిక ప్రదేశాలకు అధికారిక మ్యాప్‌లో గుర్తించింది. వీటిని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో అధికారికంగా నమోదు చేయడం ద్వారా ఆయా ప్రాంతాలను ఖచ్చితంగా గుర్తించడం, ప్రజల్లో అవగాహన పెచండం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. భారత్ నిర్ణయంపై చైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్ ఇలా పేర్లు పెట్టడాన్ని ‘‘చట్టవిరుద్ధం, చెల్లుబాటు కానిది’’గా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ పేర్కొన్నారు.

చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను సౌత్ టిబెట్ లేదా జాంగ్నాన్ ‌గా పేర్కొంటోంది. ఈ ప్రాంతం తమదే అని వాదిస్తోంది. పలు సందర్భాల్లో అరుణాచల్‌లోని ప్రాంతాలకు పేర్లు పెట్టడం చేసింది. ఈ ఏడాది కూడా భారత భూభాగాలకు చైనీస్ పేర్లు పెట్టింది. అయితే, చైనా పేర్లు పెట్టింతన మాత్రన వాస్తవాలు మారిపోవడని భారత్ చెప్పింది. చైనా చర్యల్ని ‘‘కల్పిత పేర్లు’’, ‘‘నిరాధార కథనాలు’’గా కొట్టిపారేసింది. భారత్-చైనా సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఇలాంటి చర్యలు ఆటంకం కలిగించే అవకాశం ఉందని కూడా భారత్ పేర్కొంటోంది.